Site icon HashtagU Telugu

Michelle Obama Emotional Post: నా కుటుంబం, నా ఇల్లు ‘బరాక్’.. మిచెల్ ఒబామా పోస్ట్ వైరల్!!

Obama

Obama

పెళ్లంటే నూరేళ్ల పంట.. ఈ విషయాన్ని నిజం చేసి చేపిస్తున్నారు ఒబామా దంపతులు. బ్రేకప్స్, డేటింగ్ పేరుతో వైవాహిక జీవితాలు నిర్వీర్యమవుతున్న నేపథ్యంలో ఈ జంట ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ  గ్రేట్ కపుల్ అని నిరూపించుకుంటున్నారు. మిచెల్ ఒబామా కు సంబంధించిన ఓ పోస్టును అందర్నీ ఆకట్టుకుంటోంది. “పెద్దయ్యాక, నేను అనేక ప్రదేశాలలో నివసించాను. కానీ నాకు సంబంధించినంతవరకు ఒబామానే నాకు ఇల్లు లాంటివాడు. నా ఇల్లు నా కుటుంబం. నా ఇల్లు బరాక్’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎమోషన్ పోస్ట్ పెట్టారు.

అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే వాళ్ల వైవాహిక జీవితం కనీసం 50-50 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ వైవాహిత జీవితంలో ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉంటూ అన్యోనంగా జీవిస్తున్నారు. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కచ్చితంగా కంప్రమైజ్ కావాలని, అప్పుడే భార్యభర్తలు అర్థం చేసుకోగలరని, జీవితం కూడా బాగుంటుంది అని మిచెల్ ఒబామా చెప్పింది. డేటింగ్ ల కారణంగా వైవాహిక జీవితాలు దెబ్బతింటున్నాయని ఆమె తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీ కపుల్స్ లో ఈ జంట ఒకటి. ఎన్నో వేదికల మీద ఈ జంట తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపర్చిన విషయం తెలిసిందే.