Site icon HashtagU Telugu

Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే ఈ జ్యూస్ లు తాగాల్సిందే?

Bone Pain

Bone Pain

Bone Health: సాధారణంగా అప్పుడప్పుడు మనకు కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకు గల కారణం ఎముకలు బలహీనపడటం. శరీరంలో క్యాల్షియం విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. అయితే ఎముకలు బలహీనపడినప్పుడు అందుకు తగిన విధంగా విటమిన్ డి,కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనిషి నిలబడాలి అన్న కూర్చోవాలి పని చేయాలి అన్న ఏ పని చేయాలి అన్న కూడా ఎముకలు అన్నది అవసరం. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే మనిషి కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు.

కీళ్ల నొప్పులు వెన్నునొప్పి సమస్యలు అలాగే ఎముకల నొప్పులు వంటివి కాల్షియం లోపం వల్లే వస్తాయి. దీంతో ఎముకలు మరింత బలహీనంగా మారి ఏ పని చేయాలి అన్న కూడా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొన్ని రకాల జ్యూస్ లను తాగడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎముకలు గట్టిగా ఉండాలి అంటే విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తినాలి. మరి ముఖ్యంగా స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. అలాగే పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ద్రాక్ష రసంలో తాగడం వల్ల ఎముకలను బలంగా ఉంటాయి.

ద్రాక్ష రసంలో విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే ఈ జ్యూస్ ఎముకలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కలిగిస్తుంది. పాలు కాల్షియం కి గొప్ప వనరు. పాశ్చరైజ్డ్ పాలలో విటమిన్ డి తో పాటుగా కాల్షియం కూడా ఎక్కువమొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే ఆకు కూరల్లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. బచ్చలి కూర, పాలకూరలో పెద్ద మొత్తంలో కాల్షియం ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. లేదంటే ఈ ఆకుకూరలను జ్యూస్ గా కూడా చేసుకుని తాగవచ్చు.

Exit mobile version