After Swim: స్విమ్మింగ్ పుల్స్ ఈత కొట్టిన తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే అలాంటి సమస్య గ్యారెంటీ?

వేసవికాలం వచ్చింది అంటే చాలు యువత చిన్న పెద్ద అందరూ కూడా ఈత కొట్టడం కోసం బావుల దగ్గరికి చెరువుల

  • Written By:
  • Publish Date - August 7, 2022 / 10:00 AM IST

వేసవికాలం వచ్చింది అంటే చాలు యువత చిన్న పెద్ద అందరూ కూడా ఈత కొట్టడం కోసం బావుల దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక సిటీలలో ఉండేవారు అయితే దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కి వెళ్తూ ఉంటారు. అయితే స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే చాలామంది సిటీలలో ఉండేవారు ఫిట్నెస్ కోసం అయినా కూడా స్విమ్మింగ్ పూల్స్ లో ఈత కొడుతూ ఉంటారు. స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఆ నీటిలో ఉండే ఒక జీవి వల్ల మాత్రం లైఫ్ రిస్క్ లో పడే ప్రమాదం ఉందట.

అయితే స్విమ్మింగ్ చేసిన తర్వాత తల నొప్పి, జ్వరం, మెడ పట్టేసినట్టవడం, బ్యాలెన్స్ కోల్పోవడం, మూర్చ రావడం, వికారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలట. ఎందుకంటే.. నెగ్లేరియా ఫౌలెరి అనేది ఒక అమీబా పేరు. దీన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా స్విమ్మింగ్ పూల్, సరస్సులు, నదుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇవి మనిషి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తరువాత శరీరంలోకి ఎంటర్ అయిన ఐదురోజుల్లోనే మెదడును ఇన్‌ఫెక్ట్ చేసి ప్రాణాలు తీస్తుంది. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన 36ఏళ్ల వ్యక్తి ఈ అమిబా బారినపడి ప్రాణాలు వదిలాడు.

నెగ్లేరియా ఫౌలెరి వల్ల ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన ఇన్ఫెక్షన్‌కు గురై అతడు ప్రాణాలు వదిలినట్టు డాక్టర్లు తెలిపారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..1962 నుంచి 2019 మధ్య కాలంలో అమెరికాలో 148 కేసులు నమోదు అయ్యాయి. గత గడిచిన 10 ఏళ్లలో 34 మంది దాని బారిన పడగా కేవలం ముగ్గురు మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. పామ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారికి వైద్యం అందించడానికి నిర్దిష్టమైన చికిత్సా విధానం లేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.