Skin Care@Monsoon: వర్షాకాలంలో చర్మం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం వచ్చింది అంతే చాలు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - July 10, 2022 / 11:00 AM IST

వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం వచ్చింది అంట్టే చాలు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలంలో కంటికి కనిపించచని సూక్ష్మజీవుల వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోని వర్షాకాలంలో ఆరోగ్యంతో పాటుగా చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా సీజన్లతో పాటు వర్షాకాలంలో చర్మం కోసం అదనంగా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలం ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే ప్రభావం చేస్తుందో మన చర్మాన్ని కూడా అదే విధంగా ప్రభావితం చేస్తుంది. వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మొటిమలు, తామర లాంటి చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి.

మరి వర్షాకాలంలో చర్మాని రక్షించుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో మీ చర్మాన్ని శుద్ధి చేసి ఇన్ఫెక్షన్ నుంచి నివారించడం కోసం ఒక తేలికపాటి ఫేస్ వాష్ ను ఉపయోగించాలి. అయితే చర్మ సౌందర్యాన్ని సంరక్షించడానికి ఉపయోగించే కఠినమైన ఉత్పత్తులను వినియోగించినట్లయితే ఆ సున్నితమైన చర్మం పై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే చర్మంపై అదనపు మలినాలను తొలగించడం కోసం ఈ టోనింగ్ బాగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో మీ చర్మకణాలు బహిర్గతం కావడం వల్ల మీ చర్మ రంద్రాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

అలాంటప్పుడు ఈ టోనింగ్ మూసుకుపోయిన మీ చర్మ రంధ్రాలకు చాలా సహాయకారిగా పనిచేస్తుంది. టోనింగ్ ను వారానికి ఒక్కసారి ఉపయోగించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మలినాలను నిర్మూలించవచ్చు. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ ను ఉపయోగించకూడదు. ఒకవేళ బయటకు వెళ్లాలి అనుకుంటే చర్మాన్ని సంరక్షించే పౌడర్ లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే వర్షాకాలంలో చర్మాని హైడ్రెట్ గా ఉంచడం కోసం మంచినీళ్లు తాగడం అనేది బాగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి. అదేవిధంగా చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఇతర సౌందర్య సాధనాలను వాడటం కంటే ఇందులో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం ఎంతో ఉత్తమం. వర్షాకాలంలో తేనే,బొప్పాయి, పెరుగు, ముల్తానీ మట్టి వంటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ ను చేసుకొని వాడటం ఎంతో మంచిది.