Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టు వేగంగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?

Hair Tips

Hair Tips

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. జుట్టు రాలిపోవడం, జుట్టు చిట్లిపోవడం, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే జుట్టుకు సంబంధించిన సమస్యలను అరికట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ తో పాటుగా బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడం అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జుట్టు వేగంగా ఒత్తుగా పెరగాలి అంటే ఉసిరితో పాటు కరివేపాకు, మెంతులను ఉపయోగించాలని చెబుతున్నారు. మరి వీటితో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఉసిరితోపాటు కరివేపాకు మెంతులు వేసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత మెంతి గింజలను తీసుకొని అందులో కరివేపాకు ఉసిరి మొక్కలు వేసి బాగా కలపాలి.. ఈ మూడింటిని పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ ను జుట్టుకు బాగా పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి. అయితే జుట్టు పొడిగా ఉండేలా చూసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని వారానికి రెండు లేదా మూడు సార్లు ప్రయత్నించడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు వేగంగా ఒత్తుగా పెరుగుతుందట. జుట్టును బాగా పెరిగేలా చేయడం కోసం కరివేపాకు ఉసిరి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే మెంతులు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి. ఈ రెమెడీని తరచుగా ఫాలో అవ్వడం వల్ల జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలను అరికట్టవచ్చని చెబుతున్నారు.