Smoking: సిగరెట్ తాగిన ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తినాల్సిందే!

చాలామంది మగవారు ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకునే వరకు ప్యాకెట్లకు ప్యాకెట్లు సిగరెట్ లు తాగుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అయితే చిన్న పిల్లలు కూడా అలవాటు నేర్చుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 04:00 PM IST

చాలామంది మగవారు ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకునే వరకు ప్యాకెట్లకు ప్యాకెట్లు సిగరెట్ లు తాగుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అయితే చిన్న పిల్లలు కూడా అలవాటు నేర్చుకున్నారు. అయితే ధూమపానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా కూడా వాటిని తాగుతూనే ఉంటారు. సిగరెట్లు తాగే సిగరెట్ ప్యాకెట్ పై కూడా ధూమపానం చేయకూడదు అని రాసి ఉంటుంది. అయినా కూడా ఆ మాటలను విడిచిపెట్టి మరి తాగేస్తూ ఉంటారు. అయితే సిగరెట్ లేదంటే బీడీలు తాగడం వల్ల నికోటిన్ అనే పదార్ధం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది.

అయితే ఒక్కసారి పొగతాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసినా ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగతాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు, ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. మరి ఆ ఆహార పదార్థాలు పండ్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..యాపిల్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు ఫ్లేవనాయిడ్లు, అనామ్ల జనకాలు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల కు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడగలవు.

అలాగే వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లోని నికోటిన్ ను తగ్గించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది. వెల్లుల్లి లోయాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దానిమ్మ పండు లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మ లో ఉంటాయి. అయితే దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది. క్యారెట్ లో విటమిన్ ఏ, సీ, కే, బీ ఎక్కువగా ఉంటాయి. ఈ విటమిన్ లు అన్ని కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే నికోటిన్ ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ధూమపానం చేసే వారు రోజూ క్యారెట్ తినడం చాలా మంచిది.