Site icon HashtagU Telugu

Mushroom Kebab: ఎంతో స్పైసీగా ఉండే మష్రూమ్ కబాబ్.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోండిలా?

Mixcollage 11 Jan 2024 06 41 Pm 7216

Mixcollage 11 Jan 2024 06 41 Pm 7216

మామూలుగా మనం కబాబ్ ఐటమ్స్ ని ఇష్టపడి తింటూ ఉంటాం. కొందరు ఇంట్లో తయారుచేసిన కబాబ్ ని బాగా తింటే మరికొందరు బయట చేసిన కబాబ్ ను ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. చికెన్ కబాబ్,మటన్ కబాబ్,చేప కబాబ్ ఇలా అనేక రకాల కబాబ్ లను తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మష్రూమ్స్ కబాబ్ తిన్నారా. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మష్రూమ్ కబాబ్ కు కావలసిన పదార్థాలు:

పుట్టగొడుగులు – 200 గ్రాములు
కబాబ్ పౌడర్ – 1 ప్యాకెట్
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారంపొడి – అర చెంచా
చికెన్ మసాలా – అర చెంచా
గుడ్డు – ఒకటి
ఉప్పు – రుచి సరిపడా
నూనె – కొద్దిగా

మష్రూమ్ కబాబ్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా పుట్టగొడుగులను నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కబాబ్ పౌడర్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, చికెన్ మసాలా పొడి, గుడ్డు, నూనె, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ పదార్థాలన్నీ మష్రూమ్ కు పట్టేందుకు 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత ఒక పాత్రలో నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. అందులో నానబెట్టిన పుట్టగొడుగులను వేసుకొని బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వీటిని వేయించాలి. అంతె కరకరలాడే వేడి వేడి మష్రూమ్ కబాబ్ రెడీ.