Site icon HashtagU Telugu

Munagakaya Mutton Gravy : మునగకాయ మటన్ గ్రేవీ.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?

Munagakaya Mutton Gravy

Munagakaya Mutton Gravy

మాములుగా మనం మునగకాయతో అనేక రకాల వంటలు తినే ఉంటాం. మునగకాయ టమాటా కూర, మునగకాయ రసం, మునగకాయ వేపుడు, మునగకాయ కర్రీ, మునగకాయ మజ్జిగ కూర, మునగకాయ పులుసు ఇలాంటి వంటలను రుచి చూసి ఉంటాము. అయితే ఎప్పుడూ ఒకే రకమైన వంటలు కాకుండా అప్పుడప్పుడు ఏదైనా వెరైటీగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ రెసిపీ. మరి మునగకాయ మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి? అందుకోసం ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మునగకాయ మటన్ గ్రేవీకి కావలసిన పదార్థాలు :

మటన్ – ఒక కేజీ
మునగకాయలు – 4
టమాటాలు – 2
ఉల్లిపాయ – 2
కరివేపాకు – 2రెబ్బలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్స్
పసుపు- ఒక స్పూన్
కారం – 2 స్పూన్స్
కొబ్బరి – అర ముక్క
దాల్చిన చెక్కా, లవంగం పొడి – 1స్పూన్ యాలకులపొడి – 1 స్పూన్
ఉప్పు – తగినంత
గరం మసాలా పొడి – స్పూన్
నూనె – సరిపడా

మునగకాయ మటన్ గ్రేవీ తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా మునగకాయలు కావలసిన సైజు లో ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ పెట్టి నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత కారం పొడి, కొబ్బరి పేస్ట్, దాల్చిన చెక్కాలవంగం, యాలకుల పొడి వేసి కలపాలి. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను వేసి కొద్దిగా మగ్గిన తరువాత ఉప్పు, కారం వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు, మునగకాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించి సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించి ఇప్పుడు మూత తీసి గరం మసాలా కలిపి రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగకాయ మటన్ గ్రేవీ రెడీ.