Site icon HashtagU Telugu

Multani Mitti : ఒక టన్ను ముల్తానీ మట్టి రూ.4వేలు.. అంత రేటు ఎందుకు ?

Multani Mitti

Multani Mitti

Multani Mitti : చర్మ సౌందర్యం పేరు చెప్పగానే గుర్తొచ్చే మట్టి.. ముల్తానీ మట్టి. ఈ మట్టి వెరీ స్పెషల్. అందుకే దానికి సౌందర్య సాధనంగా అంత ప్రాధాన్యం ఉంది. రాజస్థాన్‌లోని బార్మర్‌, బికనీర్ ప్రాంతాల్లో ముల్తానీ మట్టి గనులు ఉన్నాయి. అక్కడ ఒక టన్ను ముల్తానీ మట్టిని రూ.4వేలకు అమ్ముతుంటారు. బార్మర్ ఏరియాలో ప్రతి సంవత్సరం రూ.6.50 కోట్ల విలువైన ముల్తానీ మట్టి వ్యాపారం జరుగుతుంటుంది. దీన్నిబట్టి ఆ మట్టికి ఉన్న డిమాండ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు.బార్మర్‌లోని కపూర్డి, భద్ఖా, రోహిలిలలో ముల్తానీ రాతి గనులున్నాయి. బార్మర్‌లో ఉత్పత్తి చేసిన ముల్తానీ మట్టి నాణ్యత ఎక్కువ, రేటు కూడా ఎక్కువే. బికనీర్‌లో ఉత్పత్తి చేసే ముల్తానీ మట్టిలో గులకరాళ్లు ఎక్కువ, అందుకే రేటు తక్కువ. రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే మనకు  100 గ్రాముల ముల్తానీ మట్టి రూ.30కి లభిస్తుంది. ఈ మట్టికి ఇంత ధర ఎందుకు అంటే..  దీనితో సబ్బులు, పేస్టులు, క్రీములు, కాస్మెటిక్ ఉత్పత్తులను తయారుచేస్తారు. ముల్తానీ మట్టిలో సిలికా, ఆక్సైడ్, అల్యూమినియం మూలకాలు ఉంటాయి. ఇవి మన జుట్టుకు, చర్మానికి చాలా ఉపయోగకరం.  జుట్టు మందంగా, నల్లగా ఉండేలా ఇవి దోహదం చేస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

మొటిమలు, జిడ్డు సమస్యకు చెక్

మీ మొహాన్ని మొటిమలు, జిడ్డు సమస్య ఇబ్బందిపెడుతున్నాయా ? అయితే దీనికి ఒక చిట్కా ఉంది.  పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేయండి. ఆ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌ వేసి పేస్టులా కలపండి. ఈ పేస్టుని మొటిమలపై రాయండి. పూర్తిగా ఆరాక నీటితో కడగండి. ఈ పేస్టును రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు తగ్గుతాయి. అదేవిధంగా గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్‌ జోడించి పేస్టులా నూరాలి.  దీన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై జిడ్డు(Multani Mitti) తొలగిపోతుంది.

Also Read: Best 5G Phones : రూ.15వేలలోపు బడ్జెట్లో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..