పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా లడ్డూలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే లడ్డూ లలో కూడా ఎన్నో రకాల లడ్డూలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. రవ్వ లడ్డు, బందర్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా ఎన్నో రకాల లడ్డూలను తినే ఉంటాం. అయితే మోతీచూర్ లడ్డూని ఎప్పుడైనా తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోతీచూర్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు:
శనగపిండి – పావు కిలో
ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు
నీళ్లు – పావు లీటర్
నూనె – డీఫ్రైకు సరిపడ
చక్కెర – 400గ్రాములు,
యాలకుల పొడి – 1 టీస్పూన్
వేయించిన జీడిపప్పు – కొద్దిగా
నెయ్యి – 3 టీ స్పూన్స్
నిమ్మరసం – 1 టీ స్పూన్
మోతీచూర్ లడ్డూ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో ఫుడ్ కలర్ వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపుకోవాలి. తర్వాత ఒక బాణాలి తీసుకొని నూనె పోసీ వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక మోతిచూర్ మోతీచూర్ లడ్డూ తయారు చేసుకోవడానికి చిల్లుల గంటెను తీసుకోవాలి. అందులో ఒక దగ్గర పిండిని వేస్తూ చేత్తతో కలపాలి. ఆ తర్వాత ఈ బూందీని పెద్ద మంటపై ఎర్రగా అయ్యేవరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బూందీని తయారు చేసిన తర్వాత బాణాలిలో చక్కెరను 300 ఎంఎల్ నీటి పోయాలి. వీటిని వేడి చేయాలి. పంచదార కరిగి తీగ పాకం వచ్చిన తర్వాత అందులో నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి. తర్వాత బూందీని వేసి బూందీ పంచదార మిశ్రమం అంతా కలిసేవిధంగా కలపాలి. బూందీ చక్కెర మిశ్రమాన్ని పీల్చుకుని దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీనిపై టిష్యూ పేపర్లను ఉంచి మూత పెట్టి గోరు వెచ్చగా అయ్యేవరకు అందులో ఉంచాలి. తర్వాత అందులో యాలకుల పొడి, జీడిపప్పు, నెయ్యి వేసి కలపాలి. చేతిని నెయ్యి రాసుకుంటూ మీకు నచ్చిన పరిమాణంలో బూందీ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లా చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూ రెడీ.