Common Mistakes: ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకుంటారా.. ఆ సమస్య వస్తుంది!

మీరు ప్యాంట్ వెనుక జేబులో చాలా గంటలు పర్సును ఉంచుతారా ? ఇలా గంటల తరబడి పర్సును పెట్టుకొని తిరిగితే "ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్" సమస్య వస్తుందని తెలుసా ? ఈవిషయం తెలియక ప్యాంటు ధరించే వారంతా.. వెనుక జేబులో పర్సు పెట్టుకుంటున్నారు. పర్సు నిండా డబ్బు.. రకరకాల కార్డులు పెట్టుకోవడం వల్ల నడవడానికి, లేవడానికి, కూర్చోవడానికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది.

  • Written By:
  • Publish Date - February 3, 2023 / 01:14 PM IST

మీరు ప్యాంట్ వెనుక జేబులో చాలా గంటలు పర్సును ఉంచుతారా ? ఇలా గంటల తరబడి పర్సును పెట్టుకొని తిరిగితే “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” సమస్య వస్తుందని తెలుసా ? ఈవిషయం తెలియక ప్యాంటు ధరించే వారంతా.. వెనుక జేబులో పర్సు పెట్టుకుంటున్నారు. పర్సు నిండా డబ్బు.. రకరకాల కార్డులు పెట్టుకోవడం వల్ల నడవడానికి, లేవడానికి, కూర్చోవడానికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది.  అయితే ఈ చిన్నపాటి అలవాటు మిమ్మల్ని “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్‌” బారినపడేలా చేస్తుంది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో ” పిరిఫార్మిస్ సిండ్రోమ్” అని కూడా అంటారు.

‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ అంటే ఏమిటి ?

ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తికి నిలబడినప్పుడు, నడుస్తున్న ప్పుడు కంటే కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. నడుము, పిరుదులలో ఈ నొప్పిని ఫీల్ అవుతారు. ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ ప్రధానంగా సయాటికా అనే ఒక నరానికి సంబంధించిన సమస్య. ఈ నరం మన వెన్నుపాము నుంచి నడుము మీదుగా పాదాల వరకు వ్యాపించి ఉంటుంది. వెనుక జేబులో పర్సు పెట్టుకుంటే.. ఈ నరంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెనుక జేబులోని పర్సు వల్ల సయాటికా నరం మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఆ నరం వ్యాపించి ఉండే రూట్ లోని నడుము దిగువ భాగంలో , పిరుదుల భాగంలో నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు తొడ వెనుక భాగపు నరాలలో నొప్పి కలగొచ్చు. మీ పిరుదులలో, కాలు వెనుక భాగంలో నొప్పితో పాటు తిమ్మిరి రావచ్చు.

హైదరాబాద్ లో ఒక వ్యక్తికి..

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకింది.  మొదట్లో చిన్నపాటి నరాల సమస్యగా భావించి పట్టించు కోలేదు.  కానీ నొప్పి బాగా పెరిగింది. దాదాపు మూడు నెలలుగా కుడి పిరుదు నుంచి కాలు, కాలి వేళ్ల వరకు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు.
ఎన్నో రకాల మందులు, చికిత్సలు తీసుకున్నా ఉపశమనం కలగలేదు. తర్వాత డాక్టర్‌ దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకోగా.. అతడికి “ఫ్యాట్‌ వాలెట్‌ సిండ్రోమ్‌” ఉందని తెలిసింది.

ఒక రోగిని ఎంక్వయిరీ చేయగా..

ఇటీవల ఈ సమస్య బారినపడిన ఒక వ్యక్తిని వైద్యుడు ఎంక్వయిరీ చేయగా.. తాను రోజూ 10 గంటలు జేబులో పర్సు పెట్టుకొని ఉంటానని చెప్పాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా ‘ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్’ ఉందని తేలింది. కొన్నిసార్లు ఎక్కువ దూరం ప్రయాణించే కారు , ట్రక్ డ్రైవర్లు కూడా పర్సును గంటల తరబడి వెనుక జేబులో ఉంచుకుంటారు. దీని కారణంగా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు.

ఈ పరిస్థితిని ఎలా నివారించాలి?

కూర్చున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ పర్సును వెనుక జేబులో ఉంచుకోవద్దు. దీనికి బదులుగా మీ ముందు జేబులో, జాకెట్ లేదా చొక్కాలో పర్సును ఉంచండి. ఇది మీ దిగువ వీపుపై ఒత్తిడిని కలిగించదు. ఫలితంగా కూర్చోవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒకవేళ తప్పనిసరిగా మీరు వెనుక జేబులో పర్స్ ఉంచవలసి వస్తే, దాని బరువును తగ్గించాలి.పర్స్ తేలికగా ఉంటే బెస్ట్. ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ వస్తే మొదట రోగి నరాల వ్యవస్థ ను పరీక్షిస్తారు.  కొన్ని వ్యాయామాలను కూడా చేయమని సలహా ఇస్తారు.