Marriage Issues: పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు ఇవే…వెంటనే జాగ్రత్తపడండి, లేకపోతే చాలా నష్టపోతారు.!!

పెళ్లి అనేది ఒక పురుషుడు లేదా స్త్రీ జీవితంలో ఒక ప్రధాన ఘట్టం. ఎందుకంటే పెళ్లికి ముందు హాయిగా ఉన్నవాళ్లు తరువాత జీవితంలో ఎన్నో బాధ్యతలను ఎదుర్కొంటారు!

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 12:00 PM IST

పెళ్లి అనేది ఒక పురుషుడు లేదా స్త్రీ జీవితంలో ఒక ప్రధాన ఘట్టం. ఎందుకంటే పెళ్లికి ముందు హాయిగా ఉన్నవాళ్లు తరువాత జీవితంలో ఎన్నో బాధ్యతలను ఎదుర్కొంటారు! కొందరికి పెళ్లయిన తర్వాత సంతోషకరమైన జీవితం ఉంటే… మరికొంత మంది పెళ్లయిన తర్వాత కష్టమైన, బాధాకరమైన జీవితాన్ని గడుపుతారు. కొంతమంది దీనిని అదృష్టంగా భావిస్తారు, మరికొందరు దానిని విధి అని పిలుస్తారు.

పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తే కొన్ని సాధారణ సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.

ఎక్కడ ఎప్పుడు, ఎలా ఉండాలో తెలుసుకోండి:
కొన్నిసార్లు కుటుంబంలో పొరపాట్లు రావడం సహజం. అయితే భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవడం సరికాదు. అది చివరికి అపార్థానికి దారితీయవచ్చు. అలాగే ఈ సమయంలో ఎక్కువ కోపం తెచ్చుకోవద్దు… లేదంటే గొడవకు దారి తీస్తుంది. ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు…మీరు తీసుకునే నిర్ణయం సరైందా కాదా అనే ఇతరులను అడిగి తెలుసుకోండి.

అత్తగారితో అనుకూలత :
పెళ్లయ్యాక ఆడపిల్ల తన ఇంటిని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను వదిలి వేరే ఇంట్లో బతకడం చాలా కష్టమైన పని. అయితే ఓర్పు, సహనం తెలిసిన వారితోనే ఇది సాధ్యం. ఎందుకంటే సొంత కుటుంబానికి భిన్నమైన మరో కుటుంబంతో వెళ్లడం, అక్కడి వ్యక్తులకు తగ్గట్టుగా వారి దినచర్యలు పాటించడం, ముఖ్యంగా అత్తమామలతో కలిసి జీవించడం చాలా కష్టం. కానీ అత్తగారింట్లో ప్రతిఒక్కరినీ అర్థం చేసుకుంటూ మెదులుతూనే సంతోషంగా ఉండగలగుతారు.

బాధ్యతలు, సర్దుబాట్లు చాలా ముఖ్యమైనవి:
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. ఒంటరిగా ఉన్న జీవితం తనతో జీవితాంతం భాగస్వామి కావాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుంటారు.. పెళ్లి తర్వాత ఎన్నో బాధ్యతలు, సర్దుబాట్లు చేయాల్సి వస్తుంది. ఇక్కడ రెండు జీవితాలు మాత్రమే కాదు, రెండు కుటుంబాలు కలుస్తాయి. పెళ్లి తర్వాత అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇద్దరూ దీన్ని సరైన రీతిలో నిర్వహించాలి. సామరస్యంగా సాగితే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

డబ్బు పరంగా :
డబ్బును చూస్తే జబ్బు కూడా పోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు. నేటి కాలంలో డబ్బుకు అంత విలువైనది ఏదీ లేదు. డబ్బు లేకుండా జీవితం చాలా కష్టంగా మారుతుందని అందరికీ తెలుసు. కాబట్టి పెళ్లయ్యాక వీలైనంత వరకు ఆర్థిక విషయాల్లో సమాన బాధ్యత తీసుకుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబంలో ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటే, అది మీకు మనశ్శాంతిని ఇస్తుంది.

కొట్లాడకుండా…ప్రశాంతంగా పరిష్కరించుకోండి:
మీ ఇద్దరి మధ్య ఏదైనా అపార్థం ఉంటే, ఒకరితో ఒకరు గొడవలు పడే బదులు చాలా ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోండి. మీ భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడినట్లయితే, అది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి చెప్పేది విని, వారిని అర్థం చేసుకుని, తదనుగుణంగా స్పందిస్తే మంచిది.