Cool Drinks Danger: ఈ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. మీ బ్రెయిన్ ప్రమాదంలో పడ్డట్టే?

మానవ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాలలో బ్రెయిన్ కూడా ఒకటి. ఇది శరీరానికి కంట్రోల్ సెంటర్ లాగా పని చేస్తుంది. మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి?

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 08:15 AM IST

మానవ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాలలో బ్రెయిన్ కూడా ఒకటి. ఇది శరీరానికి కంట్రోల్ సెంటర్ లాగా పని చేస్తుంది. మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నియంత్రిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో ఏ భాగం పని చేయాలి అన్నా కూడా మెదడు ముఖ్యం. అటువంటి బ్రెయిన్ పనిచేయకపోతే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మనం తీసుకునే కొన్ని రకాల పానీయాల వల్ల మెదడు సరిగ్గా పనిచేయకపోయే అవకాశాలు ఉన్నాయట. మరి ఎటువంటి పానీయాలు మన మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 సోడా ఎక్కువగా తాగితే మెదడుకు తొందరగా వృద్యాప్యం వస్తుందట. ప్రతిరోజు సోడాను తాగే వారి మెదడు పరిమాణం తగ్గుతుంది. సోడా ఎక్కువగా తాగేవారిలో  ఎపిసోడిక్ జ్ఞాపకశక్తి సరిగా ఉంటుంది. సహజంసిద్ధంగానే మన జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. షుగర్‌ ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ తాగితే ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే అతిగా మద్యం సేవించే వారికి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్‌ మెదడు ఏజింగ్‌ ప్రక్రియను వేగవంతం చేస్తుంద. లిమిట్‌గా ఆల్కహాల్‌ తీసుకున్నా బ్రైయిన్‌ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయట.
ఇది మెదడు పనితీరుకు కారణం అవ్వడమే కాకుండా తెలుపు, బూడిద పదార్థాలు తగ్గిపోయేలా చేస్తుంది. అలాగే షుగర్‌ డ్రింక్స్‌ ఎక్కువ తాగే వారికి జ్ఞాపకశక్తి, మెదడు పరిమాణం, హిప్పోకాంపస్‌ తగ్గే అవకాశం ఎక్కువ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి పానీయాలకు దూరంగా ఉండి మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.