Site icon HashtagU Telugu

Mosambi Health Benefits: మోసాంబి బెనిఫిట్స్.. మోస్ట్ అదుర్స్..తక్కువ ధరలో ఎక్కువ లాభాలు!!

Mosambi Juice Benefits

Mosambi

చర్మ సమస్యలు పోవాలా?
రోగనిరోధక శక్తి పెరగాలా ?
మెరిసే ముఖ కాంతి కావాలా?
కళ్ల కింద వలయాలు పోవాలా?
మొటిమలు తగ్గాలా?
వీటన్నింటికీ పరిష్కారం చూపే ఒక నేచురల్ మార్గం ఉంది. అదే “మోసంబి”. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మోసంబి లో అధికంగా ఉండే నిమ్మకాయ గ్లూకోసైడ్ అయిన ఫ్లెవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్, బాక్టీరియల్ , క్యాన్సర్ నిరోధక లక్షణలను కలిగి ఉంది. కాబట్టి మోసాంబి జ్యూస్ తాగితే కళ్ల కింద వలయాలు, మొటిమలు తగ్గడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఫేస్ వాష్, క్రీమ్ సహా అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో మోసంబిని వాడుతారు. సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి, చర్మానికి చాలా మేలు చేస్తాయి.

* మొటిమలు మాయం

కళ్ల చుట్టూ వలయాలతో చాలామంది ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. నిద్రలేమి వలనో, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల.. పిల్లలకైతే ఎక్కువ సేపు మేల్కొని చదవడం వల్ల, ఎండలో బాగా తిరగడం వల్ల.. ఇలా రకరకాల కారణాలతో పిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ ఉండే సమస్య డార్క్ సర్కిల్స్. నీరు తక్కువగా తాగే వారిలో, ఆస్తమా ఉన్నవారిలో, విటమిన్ సి లోపం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే కళ్లు చుట్టూ వలయాలు, మొటిమలు పోవాలంటే మోసాంబి రసం ఎంత గానో ఉపయోగపడుతుంది.

* కంటి ఇన్ఫెక్షన్, జుట్టు సమస్యలకు చెక్

కంటి ఇన్ఫెక్షన్, గ్లాకోమా ,కంటి శుక్లమ్ వంటి సమస్యలను కూడా మోసాంబి రసం నివారిస్తుంది. మోసంబి చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. చుండ్రు మరియు జుట్టు రాలడం ఉన్నవారు రోజూ మోసంబి రసం తాగితే, ఈ సమస్యలను త్వరగా వదిలించుకోవచ్చు.

* చర్మంలో బ్లీచింగ్

చర్మాన్ని పూర్తిగా బిగుతుగా చేయడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా మెరసే విధంగా
మోసంబి రసం తోడ్పడుతుంది. ఇంకా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మోసాంబి రసం చర్మంలో బ్లీచింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. మొసాంబి చర్మంపై మచ్చలు, వర్ణద్రవ్యం తొలగించడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.