Age Gap Issues: భార్య భర్తల మధ్య ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే కలిగే నష్టాలు, లాభాలు ఇవే!

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే అనేక రకాల నష్టాలు, అలాగే లాభాలు కూడా ఉన్నాయట. మరి ఏజ్

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 01:36 PM IST

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే అనేక రకాల నష్టాలు, అలాగే లాభాలు కూడా ఉన్నాయట. మరి ఏజ్ గ్యాప్ వల్ల కలిగే ఆ నష్టాలు లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనుషుల ఆలోచనలు పదేళ్లకు ఒకసారి మారిపోతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగానే భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే ఆ జంట చూడటానికి కూడా చూడముచ్చటగా అనిపించదు. అమ్మాయి అబ్బాయి మధ్య తేడా ఉంటే వెంటనే వారి ముఖాలను వారి శరీర ఆకృతిని బట్టి చెప్పవచ్చు.

అయితే ఆ ఏజ్ గ్యాప్ అన్నది భార్యాభర్తలు సర్దుకుపోయిన కూడా చూసే వారికీ అది అంతగా నచ్చకపోవచ్చు. సమాజంలోని వ్యక్తులు అలాగే సమాజం వారిని అలాంటి వారిని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఏజ్ గ్యాప్ ఉన్న భార్యాభర్తలను చూసి వెంటనే డబ్బు సెక్స్ వంటి కారణాలనే ప్రధాన అంశాలుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఏజ్ గ్యాప్ వారి మధ్య ఉన్న మనస్పర్ధలు వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా కలగజేసుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి వైపు చేరి ఇద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇలా కొందరు పెట్టే ఆ పుల్లల వల్లే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల వరకు కూడా వెళుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తలలో ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటే వారికే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తరచుగా ఇలా జరిగితే వారి పార్ట్నర్ కు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏజ్ గ్యాప్ ఉన్న వారి మధ్య శృంగార సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏజ్ ఎక్కువగా ఉన్న వారికి శృంగారం మీద ఆసక్తి లేకపోవడంతో ఏజ్ తక్కువగా ఉన్నవారీకి అది సమస్యగా మారవచ్చు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ అన్నది పదేళ్లకు మించి ఉండకూడదు అని అంటున్నారు నిపుణులు.