Site icon HashtagU Telugu

Mop Water : ఇంట్లో దోమలు, బొద్దింకలు , చీమలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి

Mosquitoes, Cockroaches

Mosquitoes, Cockroaches

ఇల్లు (House) ఎంత శుభ్రంగా ఉంచుకున్నా వేసవికాలంలో దోమలు, చీమలు, బొద్దింక(Mosquitoes, Cockroaches)లు లాంటి క్రిమికీటకాలు ఇబ్బంది పెడతాయి. ఇవి కేవలం మన కళ్లకు ఇబ్బంది కలిగించడమే కాదు, మన ఆహారాన్ని కూడా కాలుష్యం చేస్తాయి. పప్పు, పంచదార వంటి పదార్థాల్లో చీమలు చేరడం, బొద్దింకలు మూటలు పట్టి తిరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ సమస్యలకు సమాధానం మన ఇంట్లోనే దొరుకుతుంది. ఇంటిని తుడిచే నీటిలో కొన్ని సహజ పదార్థాలను కలిపితే ఈ కీటకాలను దూరం చేయొచ్చు.

ఎసెన్షియల్ ఆయిల్స్, వెనిగర్, నిమ్మకాయతో క్లీనింగ్ నీరు

మనం ఇంటిని తుడిచే నీటిలో లావెండర్, యుకలిప్టస్, లెమన్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపితే మంచి వాసనతో పాటు క్రిమికీటకాల దూరం కావడంలో సహాయపడతాయి. అలాగే, బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపిన నీటిని ఉపయోగిస్తే బొద్దింకలు, చీమలు వంటి కీటకాలు రాకుండా నిరోధించవచ్చు. నిమ్మకాయ రసం, ఉప్పు కలిపిన నీరు టైల్స్‌పై ఉన్న మరకలను తొలగించి, క్రిమికీటకాలను కూడా నశింపజేస్తుంది. వీటిని ఓ స్ప్రే బాటిల్‌లో కలిపి నేరుగా స్ప్రే చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి.

నల్లమిరియాలు, పటికతో సహజ రక్షణ

ఇల్లు తుడిచే నీటిలో నల్ల మిరియాల పొడి కలిపితే దోమలు దూరంగా ఉంటాయి. మిరియాల్లోని సహజ ఘాటుదనం కీటకాల రాకను అడ్డుకుంటుంది. ఇదే విధంగా, పటిక వాడటం కూడా చాలా ప్రయోజనకరం. పటికను నీటిలో కలిపి నేల తుడిచితే క్రిములు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నశించి ఇంటి పరిసరాలు శుభ్రంగా మారుతాయి. ఈ చిట్కాలు సాధారణంగా ఇంట్లో దొరికే పదార్థాలతో చేయగలిగేవే కావడంతో తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఇల్లు క్లీన్‌గా ఉండటమే కాకుండా సురక్షితమైన వాతావరణాన్ని కూడా కల్పించవచ్చు.