Moong Dal Halwa: పెసరపప్పు హల్వా ఇలా సింపుల్ గా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల తీపి పదార్థాలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. పండుగలు సమయంలో అలాగే ఎవరైనా గెస్ట్ లు ఇంటికి వచ్చినప్పుడు రక

Published By: HashtagU Telugu Desk
Mixcollage 15 Dec 2023 07 31 Pm 2824

Mixcollage 15 Dec 2023 07 31 Pm 2824

మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల తీపి పదార్థాలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. పండుగలు సమయంలో అలాగే ఎవరైనా గెస్ట్ లు ఇంటికి వచ్చినప్పుడు రకరకాల స్వీట్స్ తయారు చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు ఒకే విధమైన స్వీట్లు తయారు చేసుకొని తిని చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటివారు ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్లకోసం ఈ రెసిపీ. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వాను సింపుల్ గా ఇంట్లో ఇలా చేస్తే చాలు. పిల్లలు పెద్దలు అందరూ లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెసరపప్పు హల్వాకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు – మూడు కప్పులు
నెయ్యి – చిన్న కప్పు
చక్కెర – నాలుగు కప్పులు
పచ్చికోవా – ఒక కప్పు
యాలకుల పొడి – ఒక స్పూను
జీడిపప్పు – రెండు స్పూన్లు
టూటీ ఫ్రూటీ – కొద్దిగా

పెసరపప్పు హల్వా తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా పెసరపప్పు కడిగి నీటిలో మూడుగంటలు నానబెట్టాలి. తర్వాత నానిన పప్పును బాగా కడిగి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలీలో నెయ్యి వేడిచేసి గ్రైండ్ చేసిన పెసరపప్పు ముద్దను వేసి, నెయ్యి పైకి వచ్చేలా సన్నని మంటపై కలుపుతూ ఉంటే పెసరపప్పు ముద్ద పచ్చిదనం పోతుంది. ఇప్పుడు దానిలో చెక్కెర, కోవాకలుపుకోవాలి. చక్కెర, కోవాలు కరిగి పలచగా తయారవుతాయి. ఇది హల్వా ముద్దలా గట్టిపడేవరకూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు కొంచెం మిఠాయి రంగు, యాలకుల పొడి వేసి దించాలి. ఇప్పుడు ఒక డిష్‌లో వేసి, పైన సన్నగా తరిగిన జీడిపప్పు, టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ.

  Last Updated: 15 Dec 2023, 07:31 PM IST