Site icon HashtagU Telugu

Moong Dal Halwa: ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా.. తయారీ విధానం?

Moong Dal Halwa

Moong Dal Halwa

మామూలుగా మనం పెసరపప్పుతో చేసిన అనేక రకాల వంటకాలు తినే ఉంటాం. పెసరపప్పు ఆ కూర పప్పు, పెసరపప్పు పాయసం, సరే పప్పు వడలు అంటూ రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా తిన్నారా. ఒకవేళ ఎప్పుడూ తినకపోతే, పెసరపప్పు హల్వా ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెసరపప్పు హల్వాకి కావలసినవ పదార్థాలు

పెసరపప్పు – మూడు కప్పులు
నెయ్యి – చిన్న కప్పు
చక్కెర – నాలుగు కప్పులు
పచ్చికోవా – ఒక కప్పు
యాలకుల పొడి – ఒక స్పూను
జీడిపప్పు – రెండు స్పూన్లు
టూటీ ఫ్రూటీ – కొద్దిగా

పెసరపప్పు హల్వా తయారీ విధానం:

ముందుగా పెసరపప్పు కడిగి నీటిలో మూడుగంటలు నానబెట్టాలి. తర్వాత నానిన పప్పును బాగా కడిగి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలీలో నెయ్యి వేడిచేసి గ్రైండ్ చేసిన పెసరపప్పు ముద్దను వేసి, నెయ్యి పైకి వచ్చేలా సన్నని మంటపై కలుపుతూఉంటే పెసరపప్పు ముద్ద పచ్చిదనం పోతుంది. ఇప్పుడు దానిలో చెక్కెర, కోవా కలుపుకోవాలి. చక్కెర, కోవాలు కరిగి పలచగా తయారవుతాయి. ఇది హల్వాముద్దలా గట్టిపడేవరకూ కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు కొంచెం మిఠాయి రంగు, యాలకుల పొడి వేసి దించాలి. ఇప్పుడు ఒక డిష్‌లో వేసి, పైన సన్నగా తరిగిన జీడిపప్పు, టూటీ ఫ్రూటీని వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ.