Monsoon Skin care: వర్షాకాలంలో స్కిన్ మెరిసిపోవాలంటే ఇలా చేయాల్సిందే?

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల చర్మంపై తేమ పేరుకుపోయి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కొన్ని కొన్ని సార్లు ఇవి చర్మ సమస్యలుగ

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 09:55 PM IST

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల చర్మంపై తేమ పేరుకుపోయి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కొన్ని కొన్ని సార్లు ఇవి చర్మ సమస్యలుగా కూడా మారుతూ ఉంటాయి. అయితే వాతావరణం మారినప్పుడు అధిక తేమ అనేది చర్మంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని DIYలు ట్రై చేయవచ్చు. వీటి వల్ల చర్మంపై ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యల గురించి వాటిని ఎలా పోగొట్టుకోవాలో ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తేమ పెరగడం వల్ల మీ చర్మంపై బ్యాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి.చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉండేందుకు కనీసం వారానికి 2 లేదా మూడు సార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.

లైట్ వెయిట్ జెల్ ఆధారిత్ స్కిన్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది. సాలిసిలిక్ యాసిడ్ ఆధారిత ఫేస్ వాష్ కూడా ఎంచుకోండి. దీనిని వాడడం వల్ల మీ చర్మంపై ఉన్న సహజ నూనెలు పోకుండా ఉంటాయి. ఇది మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయి తెలుసుకోవచ్చు. మీ మేకప్ రొటీన్‌ని లైట్‌గా ఉండేలా చూసుకోవాలి. బయటికి వెళ్ళి ఇంటికొచ్చిన ప్రతిసారి మేకప్‌ని రిమూవ్ చేయాలి. ముల్తానీ మట్టి, చార్‌కోల్ వంటి మాస్క్‌లు చర్మంపై జిడ్డు, మలినాలను తొలగిస్తాయి. మీ ముఖాన్ని ఎక్కువగా కాకుండా రోజుకి ఒకటి లేదా రెండు సార్లు కడిగితే చాలు. ముఖం మరి జిడ్డుగా ఉంటే ఓ రెండు చుక్కల నిమ్మరసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే సమస్య దూరమవుతుంది.

వర్షాకాలంలో అలర్జీలు రావడం కామన్. అవి చిరాకు, మంటను కలిగిస్తాయి. కాలుష్యం, వర్షం నీరు కారణంగా సమస్య పెరుగుతుంది. ఇది చివరికీ తామరగా మారుతుంది. కాబట్టి ఈ సమస్యను దూరం చేసేందుకు ఈ కింది టిప్స్ పాటించాలి. ఇందుకోసం సున్నితమైన ఫేస్, స్కిన్ వాష్‌ని ఉపయోగించాలి. ఓట్స్, అలోవేరా, శాండల్ పౌడర్, కోకో బటర్, చామంతి ఇలాంటి చర్మానికి సరిపోయే ప్రొడక్ట్స్‌ని ఉపయోగించడం మంచిది. మీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌లో ఆల్కహాల్, పారాబెన్, సువాసన లేనివాటిని ఎంచుకోవాలి. కాలికి ఎక్కువగా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ తెగ ఇబ్బందిగా ఉంటుంది. బొబ్బలు, పసుపు రంగులో మందపాటి ప్యాచెస్‌లా వచ్చి చర్మంపై దురద, కాలి పగుళ్ళు ఉంటాయి. ఇది ముదిరితే రక్తం వస్తూ చర్మం పొడిగా మారుతుంది. ఇది ఒక అంటువ్యాధి. కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి.. మీ చేతులు, కాళ్ళు క్రమంగా కడుక్కోండి. పొడిగా, తేమగా ఉండేందుకు ప్రయత్నించడం మేలు. కాటన్ క్లాత్స్‌ వాడడం మంచిది. టవల్స్, వాడే బట్టలు ఎవరితోనూ పంచుకోవద్దు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు టోనింగ్, మాయిశ్చరైజింగ్ రోటీన్‌ ఫాలో అవ్వండి.