Money Plant Benefits: ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా .. ఈ చిట్కాలు తప్పనిసరిగా తెలుసుకోండి!!

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 08:15 AM IST

మనీ ప్లాంట్ నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మనీ ప్లాంట్ పెంచుకుంటే ఇంటి అందంతో పాటు, వాస్తు పరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
మనీ ప్లాంట్ పేరు తగ్గట్టుగానే ఈ ప్లాంట్‌కు డబ్బును ఆకర్షించే గుణం ఉంటుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంట్లో అదృష్టం, సంపదను తెస్తుంది. మీరు కూడా మీ ఇంటి సుఖ సంతోషాల కోసం ఎంతో ఆసక్తితో మనీ ప్లాంట్‌ను నాటినా, అకస్మాత్తుగా దాని ఎదుగుదల ఆగిపోవడం, సరిగ్గా పెరగకపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే మనీ ప్లాంట్‌ను ఎలా పెంచాలనే చిట్కాలను తెలుసుకోండి.

* మట్టిలో లేదా నీటిలో పెంచొచ్చు

మనీ ప్లాంట్‌ ను మట్టిలో లేదా నీటిలో పెంచొచ్చు. మీ మొక్కపై ఆకులు రాకుండా ఉంటే నీటిలో కాకుండా మట్టిలో నాటడం మంచిది. కుండలో ఉంచే ముందు కాండం, ఆకులను కత్తిరించండి. ఆ తరువాత దానిని మట్టిలో కప్పి పాతిపెట్టండి. నాటిన కొత్తలో ఎరువులు వేయొద్దు.

* నీటిని మారుస్తుండాలి

మీ మనీ ప్లాంట్‌ నీటిలో బాగా పెరుగుతున్నట్లు మెుక్క ఉన్న నీటిని ప్రతి 15 నుండి 20 రోజులకు ఒక్కసారి కుండిలోని నీటిని మారుస్తుండాలి. ప్లాంట్ ఆరోగ్యంగా పెరగాలంటే మనీ ప్లాంట్ నోడ్ తప్పనిసరిగా నీటిలో మునిగి ఉండాలి.

* నీటిని ఫిల్టర్ చేసి పోయాలి.

మనీ ప్లాంట్ కు ఎల్లప్పుడూ నీటిని ఫిల్టర్ చేసి పోయాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు మాత్రమే నీరు పోయాలి. నీరు పోసే క్రమంలో ఆకులపై కూడా నీరు చల్లాలి. అయితే ఆకులపై ఎక్కువగా నీరు చల్లడం వల్ల అవి ఎండిపోయే అవకాశం ఉంది. చలికాలంలో ఈ మొక్కకు ఎలాంటి ఎరువులు వేయకూడదు.

* డైరెక్ట్ గా సూర్యకాంతి పడొద్దు

మనీ ప్లాంట్‌ పై డైరెక్ట్ గా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎప్సమ్ సాల్ట్‌ను జోడించవచ్చు. మనీ ప్లాంట్‌కు ప్రతిరోజూ నీళ్లు పెట్టొద్దు.

* ఫలదీకరణం చేయొద్దు

మెుక్కను ఎప్పుడూ అతిగా ఫలదీకరణం చేయవద్దు. ఎందుకంటే అలా చేయడం వలన ఆకులు కుళ్ళిపోవడం, మూలాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

* క్రమం తప్పకుండా కత్తిరించండి

మొక్కను క్రమం తప్పకుండా కత్తిరించండి. ఎండిన లేదా కుళ్ళిన ఆకులను తొలగించండి. లేకపోతే, మెుక్కను పెంచడం పెద్ద సవాలుగా ఉంటుంది.

* పొడి వాతావరణమే అడ్డంకి

సాధారణంగా పొడి వాతావరణంలో మెుక్క పెరుగుదల అడ్డంకిగా మారుతుంది. కాబట్టి, ఆకులను తొలగించడం వల్ల ప్రయోజనకరంగా ఉండవచ్చు.

* ఈశాన్యం దిక్కులో వద్దు

సాధారణంగా దైవానికి సంబంధించినది ఏదైనా ఈశాన్య దిశలో ఉంచడానికి ప్రయత్నిస్తాం. అయితే, మనీ ప్లాంట్‌ను మాత్రం ఈశాన్యం,తూర్పు, పడమర దిక్కులలో పెంచకూడదు. ఈ దిక్కులలో మనీప్లాంట్‌ నాటితే, రుణాత్మక శక్తి పెరిగిపోయి ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెడతాయని హెచ్చరిస్తారు నిపుణులు. అదే ఆగ్నేయ దిశలో పెంచితే కుజ, శుక్ర గ్రహాల అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. రుణబాధలూ తగ్గుతాయంటారు. వినాయకుడిని ఆగ్నేయ దిశకు అధిపతిగా భావిస్తారు.

* తీగ పందిరి ఎక్కితే

మనీప్లాంట్‌ తీగ గృహానికి కొత్త శోభ తీసుకొస్తుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌ ఇంట్లో అయినా మనీప్లాంట్‌ను నేలలో కాకుండా, కుండీలోగానీ, నీళ్ల సీసాలోగానీ పెంచడం మంచిది. అలాగే, తీగను నేలపై పాకించకుండా, పందిరి ఎక్కించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పురోగతి బాగుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మొక్కను వాకిట్లోనో, పెరట్లోనో కాకుండా ఇంట్లో కానీ, బాల్కనీలో కానీ పెంచుకోవడం మంచిది.

* ఎవరికీ ఇవ్వొద్దు

మనీప్లాంట్‌ను నర్సరీ నుంచి కొని తెచ్చుకోవాలి. అంతేకానీ ఎవరినుంచీ ఉచితంగా తీసుకోవడం గానీ, ఇతరులకు ఇవ్వడం గానీ మంచిది కాదంటారు. దీనివల్ల ఇచ్చేవారి అదృష్టం, తీసుకునేవారికి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. అటూ ఇటూ అయినా కావచ్చు.