Site icon HashtagU Telugu

Mokkajonna Vada: ఇంట్లోనే వేడివేడిగా రుచికరమైన మొక్కజొన్న వడలు తయారుచేసుకోండిలా?

Mixcollage 11 Dec 2023 05 59 Pm 5526

Mixcollage 11 Dec 2023 05 59 Pm 5526

మామూలుగా మనం స్నాక్ ఐటమ్స్ గా ఎన్నో రకాల వడలను తింటూ ఉంటాం. మిరపకాయ వడలు, బంగాళదుంప వడలు, అలసంద వడలు, శనగపిండి వడలు, కోడిగుడ్డు వడలు అంటూ రకరకాల పదార్థాలతో తయారుచేసిన వడలను తినే ఉంటాం. కానీ ఎప్పుడైనా వెరైటీగా మొక్కజొన్న వడలు తయారు చేసుకునే తిన్నారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే రుచికరమైన మొక్కజొన్న వడలు ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొక్కజొన్న వడలకు కావలసిన పదార్థాలు

మొక్కజొన్న పొత్తులు – ఐదు
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిర్చి – ఐదు
కరివేపాకు – నాలుగు రెబ్బలు
క్యాప్సికమ్ – అరకేజీ
ఉల్లిపాయలు – నాలుగు
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

మొక్కజొన్న వడలు తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా మొక్కజొన్న పొత్తులను ఒలిచి వాటి గింజలను కంకి నుంచి తొలగించాలి. తరువాత ఉల్లిపాయలను, కాప్సికమ్ బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చి గింజలను మిక్సీలో వేసి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మొక్కజొన్న మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, కాప్సికమ్, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక్కొక్క ముద్దను ఆరచేతిలో వడలా నొక్కి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు రెడీ.