Site icon HashtagU Telugu

Mokkajonna Vada : వర్షాకాలంలో వేడివేడిగా మొక్కజొన్న వడలు.. ఇంట్లోనే చేసుకోండిలా?

Mokkajonna Vada

Mokkajonna Vada

ప్రస్తుతం మనకు ఎక్కడ చూసినా కూడా తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఇలా వర్షాలు పడే క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు మనకు ఏవైనా కూడా హాట్ హాట్ గా ఏమైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది బజ్జీలు, పకోడా వంటివి స్నాక్ ఐటమ్ చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా కూడా మొక్కజొన్నలు విరివిగా లభిస్తూ ఉంటాయి. మొక్కజొన్నలతో కాస్త డిఫరెంట్గా మొక్కజొన్న వడలు చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి మొక్కజొన్న వడలు ఎలా తయారు చేసుకోవాలి?అందుకే పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొక్కజొన్న వడలకు కావలసిన పదార్థాలు

మొక్కజొన్న పొత్తులు – ఐదు
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిర్చి – ఐదు
కరివేపాకు – నాలుగు రెబ్బలు
క్యాప్సికమ్ -ఆరకేజీ
ఉల్లిపాయలు – నాలుగు
ఉప్పు, నూనె -తగినంత

మొక్కజొన్న వడలు తయారీ విధానం:

ముందుగా మొక్కజొన్న పొత్తులను ఒలిచి వాటి గింజలను కండె నుంచి తొలగించాలి. తరువాత ఉల్లిపాయలను, కాప్సికమ్ బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చి గింజలను మిక్సీలో వేసి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మొక్కజొన్న మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, కాప్సికమ్, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక్కొక్క ముద్దను ఆరచేతిలో వడలా నొక్కి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు రెడీ.