అప్పుడే నెమ్మదిగా ఎండలు మొదలయ్యాయి. మధ్యాహ్న సమయంలో అయితే ఎండల దెబ్బకు ప్రజలు బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. అయితే వేసవికాలం మొదలయ్యింది అంటే మనకు ఎక్కువగా దొరికే పల్లెలో పుచ్చకాయ కూడా ఒకటి. వేసవిలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన పంటలో పుచ్చకాయ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ పుచ్చకాయను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటూ ఉంటారు. కొందరు నేరుగా తింటే మరికొందరు షర్బత్ అంటూ రకరకాల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు పుచ్చకాయతో చేసిన మొహబ్బత్ కా షర్బత్ తాగారా. ఇది దిల్లీలో ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ షర్బత్. ఒకవేళ తాగకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొహబ్బత్ కా షర్బత్ కి కావాల్సిన పదార్థాలు :
పాలు- రెండు కప్పులు
పుచ్చకాయ ముక్కలు – కప్పు
రూఆఫ్జా- నాలుగు స్పూన్లు
ఐస్ క్యూబ్స్ – తగినన్ని
పుదీనా – కొద్దిగా
మొహబ్బత్ కా షర్బత్ తయారీ విధానం
ఇందుకోసం ముందుగా ఐస్‌క్యూబ్‌లు, రూఆఫ్జా, పాలను మిక్సీలో కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అరకప్పు పుచ్చకాయ ముక్కల్నీ జతచేయాలి. ఈ షర్బత్‌ను గ్లాసుల్లో పోసి పైన మిగతా పుచ్చ ముక్కల్ని వేస్తే సరి. అలాగే పుదీనా అన్నది మీ ఛాయిస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ షర్బత్ దిల్లీలో ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని ఇంట్లోనే సింపుల్ గా పైన చెప్పిన విధంగా ట్రై చేసుకుంటే చాలు ఇంటిల్లిపాది తాగవచ్చు.
