Mobile Number Numerology: మొబైల్ నంబర్‌లోని అంకెలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మొబైల్ నంబర్ చివరలో ‘సున్నా’ (0) ఉండటం వల్ల కలిగే ప్రభావాల గురించి మొబైల్ సంఖ్యాశాస్త్రం (Mobile Numerology) ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకోండి. చాలా మంది ఫ్యాన్సీ నంబర్ల కోసం నంబర్ చివరలో 000 లేదా నాలుగు సున్నాలు ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.
మొబైల్ నంబర్ చివర సున్నా ఉండటం
మొబైల్ సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మొబైల్ నంబర్ చివరలో సున్నా ఉండటం ఆధ్యాత్మిక, రహస్య శక్తులకు ప్రతీకగా భావిస్తారు. అయితే సాధారణంగా ఫోన్ నంబర్ చివర సున్నా ఉండటం మంచిది కాదని అంటారు. ఇది అనేక విధాలుగా అశుభంగా పరిగణించబడుతుంది. నంబర్ చివర సున్నా ఉంటే మీరు ఆశించిన శుభ ఫలితాలు అందవు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫోన్ నంబర్‌లోని చివరి 4 అంకెల్లో సున్నా ఉండకూడదు. ముఖ్యంగా చివరి అంకెగా సున్నా అస్సలు ఉండకూడదు.
Also Read: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం!
ఏ పని చేసినా ఫలితం ‘శూన్యం’
ఫోన్ నంబర్ చివరలో సున్నా ఉంటే ఆ నంబర్ ద్వారా చేసే ప్రయత్నాల ఫలితం కూడా సున్నా (శూన్యం) అవుతుందని నమ్ముతారు. మీకు కాల్స్ రావచ్చు, మాట్లాడవచ్చు కానీ ఫలితం మాత్రం ఉండదు. ఒకవేళ మీరు వ్యాపారం కోసం ఇలాంటి నంబర్‌ను ఉపయోగిస్తుంటే దానిని వెంటనే మార్చుకోవడం మంచిది. దీని ప్రతికూల ప్రభావం వల్ల కస్టమర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తాయి కానీ, డీల్స్ మాత్రం కుదరవు. దీనివల్ల వ్యాపారంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
నెంబర్ మధ్యలో ఒకటి లేదా రెండుసార్లు సున్నా వస్తే అది సామాన్యంగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ సార్లు సున్నా రావడం లేదా చివరి నాలుగు అంకెల్లో సున్నాలు ఉండటం ప్రతికూలతను పెంచుతుంది. మీ మూలాంకం, భాగ్యాంకంకు సరిపోయే నంబర్‌ను ఎంచుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
