Neem Face Pack : ప్రస్తుత రోజుల్లో చెడు ఆహార అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి కారణంగా అనేక రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొటిమలు, చర్మం పొడిబారడం, బ్లాక్ హెడ్స్, నల్లమచ్చలు, టాన్ వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి, అందాన్ని సంరక్షించుకోవడానికి వేప (Neem) సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వేపలోని విటమిన్-ఎ, సి, కెరొటినాయిడ్స్, లినోలియిక్, ఒలియిక్ వంటి సమ్మేళనాలు చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయట. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయోటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. వేప (Neem) వల్ల చర్మాన్ని ఎలా సంరక్షించుకోవచ్చో,చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. మీరు మొటిమల కారణంగా ఇబ్బంది పడుతుంటే ఒక పది వేపాకులు, తీసుకొని కొన్ని నారింజ తొక్కలను కలిపి కొన్ని నీళ్లు వేసి మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా తేనె, పెరుగు, పాలు మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా కాలుష్యం, యూవీ కిరణాల కారణంగా రంగు తగ్గుతుంది. అలాగే ముఖం కూడా నిర్జీవంగా మారుతుంది.
వేప మీరు కోల్పోయిన ఛాయను తిరిగి పొండానికి సహాయపడుతుంది. ఇందుకోసం నాలుగు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ తేనె, రెండు టీస్పూన్ ల నిమ్మరసం ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇది ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై నలుపు ఛాయలు తగ్గి ముఖం మెరిసిపోతుంది. వేపాకుల పేస్ట్, పసుపు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి పూత వేసుకుని పావుగంటాగి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. వేపలోని గుణాలు ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేసి చర్మరంధ్రాల్లోని మురికిని పోగొడతాయి.
వేప ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ ట్రైగ్లిజరైడ్స్, విటమిన్ ఈ నిండి ఉంటాయి. వేపలోని పోషకాలు ముడతలు, గీతలు, డార్క్ స్పాట్‌లను తగ్గించి మీ చర్మాన్ని టోన్‌గా మార్చుతాయి. రెండు టేబుల్ స్పూన్ల వేప పొడిలో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముడతలు మాయం అయ్యి, యంగ్ లుక్ మీ సొంతం అవుతుంది. పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల ముఖం మెరిసిపోవడంతో పాటు చర్మానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు కూడా ఉండవు.
Also Read: January: సంవత్సరంలో మొదటి నెలకు జనవరి అనే పేరు ఎలా వచ్చిందంటే ..?