Site icon HashtagU Telugu

Mixed Vegitable Curry: మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెసిపీ ఇంట్లోనే ట్రై చేయండిలా?

Mixed Vegitable Curry

Mixed Vegitable Curry

మామూలుగా ఇంట్లో ఉండే ఆకుకూరలు కూరగాయలు అన్నింటినీ కలిపి వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ పులావ్, వెజిటేబుల్ కర్రీ, వెజిటేబుల్ సలాడ్ అంటూ రకరకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ రెసిపీని ఇంట్లో తయారు చేశారంటే పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా లొట్టలు వేసుకొని మరి తినేస్తారు. మరి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి? అందుకే ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కావలసిన పదార్థాలు:

ఆలూ – రెండు
క్యారట్ – ఒకటి
బీన్స్ – పది వరకు
కాప్సికం – ఒకటి
చిలకడ దుంప – ఒకటి
వంకాయ – రెండు
తీపి గుమ్మిడి – చిన్న ముక్క
పాలకూర – రెండు కట్టలు
నూనె – రెండు చెంచాలు
నువ్వులు – రెండు చెంచాలు
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – మూడు
కరివేపాకు – కొంచం

మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారీ విధానం:

ముందుగా పాలకూర , ఇతర ఆకు కూరల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలి లో నూనె వేసి జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు, ఆఖరున నువ్వులు వేసి ఆ తర్వాత ముందుగా కూరలని వేయాలి. అప్పుడే కొంచం ఉప్పు కూడా వేసి మూత పెట్టాలి. కూరలు మెత్తపడుతుండగా పాలకూర కూడా వేసి బాగా కలిపి మళ్ళి మూత పెడితే, రెండు నిమిషాలలో పాలకూర మెత్తపడుతుంది. అప్పుడు మూత తీసి కొంచం సేపు వేయించాలి. ఆఖరున కొంచం బెల్లం కావాలంటే కలుపుకోవచ్చు . మరి ఎక్కువ తీపి కాకుండా కలపాలి. తీపి ఇష్టం లేని వారు బెల్లం వేయక పోయినా కూర రుచిగా వుంటుంది. నువ్వులు రుచి తో బావుంటుంది. కమ్మగా ఉంటుందేమో పిల్లలు హాయిగా తినేస్తారు..