Site icon HashtagU Telugu

Miriyala Chekkalu: ఎంతో క్రిస్పీగా ఉండే మిరియాల చెక్కలు.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు?

Mixcollage 25 Dec 2023 05 01 Pm 5160

Mixcollage 25 Dec 2023 05 01 Pm 5160

చెక్కలు.. వీటినే కొన్ని కొన్ని ప్రదేశాలలో అప్పలాలు, లేదా కారం చుట్లు, చెక్కిలాలు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇవి కారం కారంగా క్రిస్పీగా తినడానికి ఎంతో బాగా రుచిగా ఉంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే మరి ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం

మిరియాల చెక్కలకు కావలసిన పదార్థాలు:

మినప గుండ్లు
బియ్యప్పిండి
ఉప్పు
మిరియాలు
నీళ్లు
జీలకర్ర
ఇంగువ
వెన్న
వాము

మిరియాల చెక్కలు తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక కప్పు మినపగుండ్లను వేయించుకొని మిక్సీ జార్లో పొడిచేసి జల్లించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక రెండు కప్పుల బియ్యప్పిండిని కూడా జల్లించుకొని మినప పిండిలో కలుపుకోవాలి. తర్వాత దానిలోకి పావు కప్పు మిరియాలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని దాన్లో కొంచెం జీలకర్ర కూడా వేసి పిండిలో కలుపుకోవాలి. తర్వాత కొంచెం వెన్న, కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకొని తర్వాత నీటిని వేస్తూ గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 30 నిమిషాల పాటు దీనిని నానబెట్టి, తర్వాత ఆ పిండి లోంచి కొంచెం పిండిని తీసి మిగతా పిండిని తడి బట్ట కప్పి ఉంచుకోవాలి. ఆ పిండిని ఉండల్లా చేసుకుని ఒక పాలిథిన్ కవర్ ని తీసుకొని దానిపై ఆయిల్ రాసి ఈ పిండి ముద్దుని దానిపై పెట్టి మళ్ళీ కవర్ని కప్పి ఒక ప్లాట్ గిన్నెను తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఫ్రెష్ చేసుకొని ఈ చెక్కలను ఒక బట్టపై పరుచుకోవాలి. ఇలా అన్ని చెక్కలను చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో నాలుగైదు చెక్కలను వేసి ఎర్రగా, క్రిస్పీగా వచ్చేవరకు వేయిస్తే సరి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల చెక్కలు రెడీ..