Site icon HashtagU Telugu

Hair Tips: అవిసె గింజలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండిలా?

Mixcollage 14 Jan 2024 02 55 Pm 201

Mixcollage 14 Jan 2024 02 55 Pm 201

అవిసె గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. విటమిన్ బి, ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టును మృదువుగా తయారు చేసే హెయిన్ ఫాలికల్స్ కు పోషణ లభిస్తుంది. కేవలం జుట్టుకు సంబంధించిన సమస్యలకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే జుట్టు రాలే సమస్యను తగ్గించి కురులను ఒత్తుగా చేసుకునేందుకు అవిసె గింజలు ఎలా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతిరోజూ మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చడం, అవిసె గింజెల నూనె, జెల్ వాడకంతో మీ జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే జుట్టు లోపలి నుంచి పోషణ లభిస్తుంది. అయితే అవిసె గింజల్లో ఉండే విటమిన్ ఈ దాని బలమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యను తరిమికొడ్తుంది. అలాగే ఒత్తిడి కారణంగా ఏర్పడే అకాల బూడదని నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అవిసె గింజల్లో ఉండే విటామిన్ బి లోపం జుట్టు రాలడంతో సంబంధం కల్గి ఉంటుంది. అవిసె గింజెల్లో ఉండే విటామిన్ బి12, బయోటిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫిరిడాక్సిన్, పాంతోతేనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.

అంతే కాకుండా అవిసె గింజెల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లం శరీరంలో మంటను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇది జట్టు రాలడాన్ని, జుట్టు బలహీనతను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతో అవసరం అవిసె గింజెలు ప్రోటీన్ గ్లూటెన్-రహిత మూలం. వీటని తీసుకోవడం వల్ల జుట్టు మరింత దృఢంగా మారుతుంది. అవిసె గింజలు స్కాల్ప్ పీహెచ్ స్థాయిలు చమురు ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సాయపడుతాయి. ఈ కారకాలు జుట్టు పెరుగల రేటును కురుల ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. అంతే కాదండోయ్ అవిసె గింజెలు మీ జుట్టును మృదువుగా చేసేందుకు ఎంతగానో దోహదపడతాయి. అయితే ఇవి ఇవి తేమను కట్టడి చేస్తూ జుట్టు చిట్లడం, చివర్లు చీలిపోవడం, పొడి బారడం వంటి సమస్యలను అరికడతాయి. అయితే జుట్టు రాలేందుకు ప్రధాన కారణమైన దురదను తగ్గించడంలో అవిసె గింజెలు ఎంతగానో ఉపయోగపడుతాయి. అందుకే అవిసె గింజెల నూనె, జెల్ ని ప్రతిరోజూ వాడాలి. కుదరపోతే మీరు తినే ఆహార పదార్థాల్లోనైనా అవిసె గింజెలు ఉండేలా చూస్కోండి.