Milk Powder Barfi: పాలపొడి బర్ఫీ.. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు?

మాములుగా చిన్న పిల్లలు ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్నాక్ ఐటమ్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 18 Feb 2024 09 17 Pm 1089

Mixcollage 18 Feb 2024 09 17 Pm 1089

మాములుగా చిన్న పిల్లలు ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్నాక్ ఐటమ్ గా ఎక్కువగా ఇలాంటి పదార్థాలని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది పిల్లలు బయట దొరికే ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో పాలపొడి బర్ఫీ కూడా ఒకటి. చాలామంది ఈ బర్ఫీని ఇంట్లోనే ట్రై చేయాలని అనుకున్నప్పటికీ ఎలా తయారు చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు..మరి పిల్లలు ఎంతమంది ఇష్టపడే ఈ పాలపొడి బర్ఫీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

పాలపొడి – రెండు కప్పులు
చక్కెర – ఒక కప్పు
జీడిపప్పు – గుప్పెడు
బాదం పలుకులు – గుప్పెడు
పిస్తా – గుప్పెడు
కిస్మిస్ – పది
యాలకులు – మూడు
నెయ్యి – రెండు స్పూన్లు

తయారీ విధానం :

ముందుగా డ్రైఫ్రూట్స్ అన్నింటిని చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి అందులో పంచదార, కప్పు నీళ్లు పోయాలి. తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. తీగపాకం వచ్చిన తర్వాత మంటను తగ్గించి పాలపొడిని వేసి మెల్లగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అందులో బాదం, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి అన్ని వేసి కలపాలి. ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ప్లేట్ అంతా పరుచుకునేలా వేయాలి. పైన పిస్తా, బాదం, జీడిపప్పులతో గార్నిష్ చేస్తే బాగుంటుంది. చల్లారాక వీటిని ముక్కలుగా కోసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇవి ఫ్రెష్ గా ఉంటాయి. పిల్లలకు చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి.

  Last Updated: 18 Feb 2024, 09:18 PM IST