శరీరం బలంగా ఉండాలంటే కండరాలు, ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. అందుకే ప్రతిరోజూ పాలు, డైరీ ఫుడ్స్ తినాలని చెబుతుంటారు. పాలు, పెరుగు, జున్ను ప్రొటీన్లకు మూలాలుగా చెబుతుంటారు. అయితే డైరీ ఫుడ్స్ వల్ల ఎముకలను దృఢపరిచే కాల్షియం శరీరంలో తగ్గదు అనేది కూడా నిజం. కానీ కాల్షియం అనేది కేవలం పాలలోనే కాకుండా ఇతర అనేక ఆహారాల్లో లభిస్తుంది. అవేంటో చూద్దాం.
1. అమలాకి:
శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు అమలాకిలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం ఉంటుంది. శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది.
2. నువ్వులు:
నువులను ఆహారంలో బాగం చేసుకున్నట్లయితే..కాల్షియం పుష్కలంగా అందుతుంది. కాల్షియం లోపాన్ని నివారించడంలో నువ్వులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్లో 88మిల్లిగ్రాముల కాల్షియం ఉంటుంది. సూప్ లు, సలాడ్స్ వంటి వాటిని మీ భోజనంలో భాగంగా చేసుకోండి.
3. జీలకర్ర:
జీలకర్ర రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒక గ్లాసు నీటిని మరిగించి దానిలో ఒక టీస్పూన్ జీలకర్ వేసి కలపాలి. నీటిని చల్లార్చి తాగాలి. రోజుకు రెండుసార్లు తాగితే శరీరంలో కాల్షియం లోపం తగ్గుతుంది.
4.అత్తిపండ్లు:
శరీరంలో కాల్షియం లోపాన్ని నివారించడంలో అత్తిపండ్లు సాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే శరీరానికి కాల్షియం అందుతుంది. రెండు గ్రాముల అత్తిపండ్లు తింటే కాల్షియం లోపం ఉండదు.
5. రాగులు:
రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజుకో కప్పు రాగులు తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది.
6. బీన్స్ :
బీన్స్ ను కాల్షియం పవర్ హౌస్ అంటారు. ఒక కప్పు బీన్స్ లో 191 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. బీన్స్ ను నిత్యం ఆహారంలో తీసుకుంటే మంచిది.