Menthikura Mutton Keema : మటన్ కీమాతో మెంతికూర.. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తింటారు..

మటన్ కీమా తీసుకుని.. శుభ్రం చేసుకోవాలి. దానిని కుక్కర్లో వేసి.. మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి.

Published By: HashtagU Telugu Desk
menthikura mutton keema

menthikura mutton keema

Menthikura Mutton Keema Recipe : మటన్.. చికెన్ కంటే మటన్ చాలా మంచిది. కానీ.. వింటర్లో తింటే కొవ్వు పేరుకుంటుందని పెద్దగా తినడానికి ఆసక్తి చూపించరు. కానీ.. ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి మటన్ ను తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. మటన్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. మటన్ కర్రీ, మటన్ పులుసు, మటన్ బిర్యానీ, మటన్ మసాలా, దోసకాయ మటన్, బీరకాయ మటన్, గోంగూర మటన్, చింతచిగురు మటన్.. ఏంటీ ఇవన్నీ చెబుతుంటేనే నోరూరి పోతుందా ? మరి మటన్ కీమాతో మెంతికూర ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి.. తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలంటారు. ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ కూడా.

మెంతికూర మటన్ కీమా తయారీకి కావలసిన పదార్థాలు

ఆయిల్ – రెండు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు

మెంతికూర – మూడు కట్టలు

జీలకర్ర – 1/2టీ స్పూన్

తరిగిన పచ్చిమిర్చి – రెండు

పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్

తరిగిన టమాటాలు – రెండు

పసుపు – 1/4 టీ స్పూన్

కారం – 1 టీ స్పూన్

ధనియాలపొడి – 1 టేబుల్ స్పూన్

ఉప్పు – తగినంత

గరం మసాలా – 1/2 టీ స్పూన్

మెంతికూర మటన్ కీమా తయారీ విధానం

మటన్ కీమా తీసుకుని.. శుభ్రం చేసుకోవాలి. దానిని కుక్కర్లో వేసి.. మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మెంతి ఆకుల్ని బాగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.

అదే నూనెలో జీలకర్ర వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకుని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చినవాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు టమాట ముక్కలు కూడా వేసి.. అవి మెత్తబడేంతవరకూ వేయించాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి వేసి వేయించాలి.

ఇవన్నీ వేగిన తర్వాత.. ఉడికించిన కీమా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గరంమసాలా వేసి కలుపుకోవాలి. దీనిపై మళ్లీ మూతపెట్టి నూనె పైకి తేలేంతవరకూ ఉడికించి స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర మటన్ కీమా రెడీ. ఇలా తయారు చేసిన మటన్ కీమాను ఎంతో ఇష్టంగా తింటారు.

Also Read : Sweet Rice With Coconut Milk: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు స్వీట్ రైస్.. ఇలా చేస్తే చేస్తే ప్లేట్ ఖాళీ?

 

 

  Last Updated: 19 Mar 2024, 08:57 PM IST