Site icon HashtagU Telugu

Menthikura Mutton Gravy: ఎంతో స్పైసీగా ఉండే మెంతికూర మటన్ గ్రేవీ.. సింపుల్ గా తయారు చేయండిలా?

Mixcollage 14 Jan 2024 08 14 Pm 4622

Mixcollage 14 Jan 2024 08 14 Pm 4622

మామూలుగా మనం మటన్ తో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటాం. మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, మటన్ సూప్ ఇలా రకరకాల రెసిపీలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా మెంతికూర మటన్ గ్రేవీ ఇంట్లోనే తయారు చేసుకుని తిన్నారా. ఒకవేళ ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ మెంతికూర మటన్ గ్రేవీని ఇంట్లోనే సింపుల్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో, అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మెంతికూర మటన్ గ్రేవీకి కావలసిన పదార్థాలు:

మెంతికూర – కొద్దిగా
మటన్ – అర కిలో
కొబ్బరి పాలు – కొద్దిగా
పసుపు – కొద్దిగా
వెల్లుల్లి – కొద్దిగా
అల్లం – కొద్దిగా
పచ్చిమిర్చి – 3-4
గరం మసాలా పొడి – అర చెంచా
ఉల్లిపాయ – 1
టొమాటో – 1 చిన్నది
నూనె – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా

మెంతికూర మటన్ గ్రేవీ తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అది వేడెయ్యాక అందులో నూనె వేసి ఉల్లిపాయలు, పసుపు వేసి బ్రౌన్ కలర్ లో కి వచ్చేదాక వేయించాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని లేదంటే పేస్టు చేసుకున్నది అందులో వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత మటన్ వేయాలి. తర్వాత మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్టు , టమోటా ముక్కలు వేసి వేయించాలి. మెంతికూర పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అందులో కొబ్బరిపాలు, గరంమసాలా పొడి వేసి మరిగించాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోయాలి. సన్నని మంట మీద 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయేంత వరకు ఉంచి మూత తీయాలి. అంతే సింపుల్ మెంతికూర మటన్ గ్రేవీ రెడీ..