Health Tips: ఒత్తిడి అలసట వల్ల మగవారికి అలాంటి సమస్యలు వస్తాయా?

ప్రస్తుత కాలంలో బిజీ బిజీ లైఫ్ వల్ల చాలామంది ఒత్తిడి అలసట, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 07:30 AM IST

ప్రస్తుత కాలంలో బిజీ బిజీ లైఫ్ వల్ల చాలామంది ఒత్తిడి అలసట, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా మగవారు ఒత్తిడి అలసట వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి అలసట వంటి సమస్యలు చూడడానికి చిన్నగా అనిపించినప్పటికీ అవి క్రమంగా పెరిగి పెద్దవవుతూ ఉంటాయి. క్రమంగా ఇవి రోగాల బారిన పడేలా చేస్తాయి. మరి మగవారికి ఒత్తిడి అలసట వంటి సమస్యల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలు క్రమంగా ఎక్కువ అయితే ఊబకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అలా ఒత్తిడి అలసట సమస్యతో బాధపడేవారు వ్యాయామం చేయడం మంచిది. ఒత్తిడి సమస్య పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరిగా ఉండే మగవారు ఈ ఒత్తిడి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారు ఎక్కువగా గుండెపోటు బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా నలుగురితో తిరుగుతూ నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. ఆందోళన,ఒత్తిడి,డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువ అయినప్పుడు వ్యాయామం యోగా వంటివి చేస్తూ ఉండటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.

అలాగే మగవారు ఒత్తిడి అలసట వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఒత్తిడి సమస్యతో బాధపడేవారు నచ్చిన వారితో కలిసి తిరగడం నచ్చిన ఫుడ్ ని తినడం అలాగే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం, నచ్చిన ప్రదేశాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఒత్తిడి,డిప్రెషన్ మంచి సమస్యల నుంచి బయటపడవచ్చు.