Men Beauty : పురుషులు ముఖం ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా కనిపించాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటించాల్సిందే?

పురుషులు (Men) తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల తరచుగా చర్మంపై మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు వస్తాయి.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 06:00 PM IST

Men Beauty Tips : మామూలుగా అందం విషయంలో పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువగా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.. అంతేకాకుండా అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో పురుషులు (Men) కూడా అందం విషయంలో శ్రద్ద చూపడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది అందం విషయంలో ఎటువంటి చిట్కాలు పాటించాలి? ఎటువంటి చిట్కాలు పాటిస్తే ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తారు అన్న విషయాలు తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అనుకుంటున్న పురుషుల కోసమే ఆర్టికల్. మరి అందంగా కనిపించాలంటే ఎటువంటి చిట్కాలను పాటించాలి. ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

మాములుగా పురుషుల చర్మం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారణంగానే స్త్రీ, పురుషుల చర్మ సంరక్షణ చర్యల్లో ప్రత్యేక విధానాలు ఉంటాయి. పురుషులు (Men) తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల తరచుగా చర్మంపై మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు వస్తాయి. కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అందులో క్లెన్సింగ్ కూడా ఒకటి.

ఇది చర్మ సంరక్షణ దినచర్యలో చాలా ముఖ్యమైన భాగం. క్లెన్సింగ్ రోజంతా చర్మం నుండి మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. వారానికి ఒకసారి మీ చర్మాన్ని మంచి స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిదంగా షేవింగ్ చేయడానికి ముందు షేవింగ్ జెల్ ఉపయోగించాలి. ఇది సబ్బు కంటే మెరుగైనది.

షేవ్ అనంతరం చర్మానికి తేమను అందించడానికి ఆఫ్టర్ షేవ్ క్రీమ్‌ను అప్లై చేయాలి. వీలైతే ఆల్కహాల్ ఆధారిత ఆఫ్టర్ షేవ్‌లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. సన్‌స్క్రీన్ సాధారణ రోజువారీ వినియోగాల్లో ఒకటి. UV కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ని ఉపయోగించవచ్చు. ఎండలో బయటకు వెళ్లే 10 నిమిషాల ముందు ముఖం, మెడపై సన్‌స్క్రీన్ రాసుకోవాలి. అలాగే మీ చర్మ రకాన్ని బట్టి బ్యూటీ క్రీమ్స్‌ని ఎంచుకోండి. పురుషులు (Men) సాధారణంగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల గురించి పట్టించుకోరు. అయితే, ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది. మొటిమలు, చర్మ సమస్యలను నివారించడానికి మీ చర్మ రకాన్ని బట్టి కస్మొటిక్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన చర్మానికి ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. ఇది చర్మానికి లోతుగా పోషణను అందించడంలో సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం మీరు ఇంట్లో తయారుచేసిన వివిధ రకాల ఫేస్ మాస్క్‌లను కూడా ఉపయోగించవచ్చు.

Also Read:  Baby Skin Care Tips: మీ పిల్లల చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు..?