Site icon HashtagU Telugu

Relationship: పెళ్లి తర్వాత పురుషులు ఈ టిప్స్ పాటిస్తే చాలు.. గొడవలు రమ్మన్నా రావు?

Relationship

Relationship

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. కొందరు భార్యాభర్తలు ఎంత గొడవపడినా కూడా వెంటనే కలిసిపోతూ ఉంటారు . మరికొందరు ఒకరి మీద ఒకరు పంతాలకు పోయి ఎవరితో ఎవరు మాట్లాడకుండా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు చిలికి చిలికి గాలి వానగా కూడా మారుతూ ఉంటాయి. అని భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది మాత్రం అర్థం చేసుకునే గుణం. ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకుంటే వారి మధ్య గొడవలు రావడం అన్నది చాలా అరుదు అని చెప్పవచ్చు.

అలాగే భార్యభర్త గొడవ పడినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు కనిపించడం వల్ల ఆ బంధం మరింత బల పడుతుంది. ప్రతిసారి ఒకరే కన్విన్స్ కాకుండా అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి అవ్వడం మంచిది. కష్టాలలో సుఖాలలో అన్నింటిలో ఒకరికొకరు తోడునీడగా ఉండాలి. పెళ్లిరోజు ప్రమాణం చేసినట్టుగా కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలోనూ వెన్నంటే ఉండాలి. చెయ్యి విడిచిపెట్టకూడదు. చాలామంది పెళ్లయిన కొత్తలో అడగకుండానే అన్ని కొనివ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజులు గడిచే కొద్ది ఆ ప్రేమ చూపించడం తగ్గించడంతోపాటు భార్యలను అవాయిడ్ చేయడం కూడా చేస్తుంటారు.

కానీ అలా చేయకూడదు. మొదట్లో ఎక్కువ ప్రేమించడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం లాంటివి చేయడం కంటే ఎప్పటికీ ఒకేలాగే ఉండడం మంచిది. ముఖ్యంగా ఏవైనా స్పెషల్ డేస్ స్పెషల్ ఈవెంట్ సందర్భాలలో స్పెషల్ గా ఏదైనా ప్లాన్ చేసి భార్యలను సర్ప్రైజ్ చేయడం ఇంప్రెస్ చేయడం వల్ల వారి బంధం మరింత బలపడుతుంది. పిసినారితనం ఉండాలి కానీ భార్య విషయంలో మాత్రం అస్సలు ఉండకూడదు. అలాంటప్పుడు మీరు కొన్నింటిని డబ్బుతో కొనలేరు. కాబట్టి భార్య విషయంలో పిసినారితనంగా ప్రవర్తించకుండా నచ్చినవి కొన్ని ఇచ్చి తన కలలో ఆనందాన్ని చూడడం మంచిది.