Site icon HashtagU Telugu

Alcohol Medications : మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

Alcohol Medication

Alcohol Medication

మన జీవనశైలే…అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. థైరాయిడ్, మధుమేహం,రక్తపోటు, ఒత్తిళ్లు,మానసిక కుంగుబాటు, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ ఇలా ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముట్టుడుతున్నాయి. వీటికోసం రోజువారీగా ఔషధాలు తీసుకోవడం తప్పడం లేదు. అదే సమయంలో ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంటే…ఈ ఔషధాలు తీసుకునే వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. కొన్ని రకాల ఔషధాలు ఆల్కహాల్ తో అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే వ్యతిరేక క్రియ జరుగుతుంది.

అలెర్జీ నివారణకు….
బెనడ్రిల్ అనేది దగ్గు మందు. దీని గురించి అందరికీ తెలుసు. దీంతోపాటు ఇతర అలెర్జీ,జలుబు నివారణకు వచ్చే యాంటీ హిస్టామిన్ ఔషధాలకు ఆల్కహాల్ తో కలవకుండా చూసుకోవాలి. ఇవన్నీ కలిపి తీసుకున్నట్లయితే తీవ్రమైన మగత ఆవహిస్తుంది. దీంతో నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఎపిలెప్సీ మందులు…
మూర్చ నివారణకు వాడే మందు బిళ్లలను ఆల్కహాల్ సమయంలో తీసుకోకూడదు. మూర్చ రాకుండా చూసుకోవడం చాలా కీలకం. కాబట్టి ఈ మందులకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మూర్చలు రిపీట్ అవుతుంటాయి. ఆల్కహాల్ సేవించిన తర్వాత మూర్చ నివారణ ఔషధాలను తీసుకోవడం వల్ల అవి పనిచేయకుండా పోతాయి.

యాంటీ డిప్రెసెంట్స్ ..
జ్ఞాపకశక్తి కోల్పోవడం,నాడీ మండల వ్యవస్థ బలహీనత, శ్వాస నిదానంగా తీసుకోవడం అనేవి యాంటీ డిప్రెసెంట్ ఔషధాలను ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల వస్తాయి.

మధుమేహం….
మనదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగుతోంది. గ్లూకోఫేజ్, ఒరినేస్, డయ్ బినేస్ వంటి ఔషధాలు షుగర్ నియంత్రణ కోసం వైద్యులు సూచిస్తుంటారు. వీటిని తీసుకుంటే ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. షుగర్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకుంటే గుండె స్పందనలు వేగంగా పెరిగి ప్రమాదం ఉంటుంది.

గుండె జబ్బుల మందులు…
ఛాతీలో నొప్పి వచ్చి, గుండె వైద్యులను సంప్రదించనట్లయితే గుండె జబ్బులు రాకుండా నివారణ మందులు ఇస్తారు. కానీ ఇవి తీసుకుంటే ఆల్కహాల్ ను దూరం పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో గడ్డలు ఏర్పరకుండా వైద్యులు సూచించే మందులను కూడా ఆల్కహాల్ తో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల అంతర్గత రక్తస్రావం ఏర్పడుతుంది. ఔషధాలకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వాట పట్ల మరింత అవగాహనగా ఉండాలి. అవసరమైతే ఔషధాలను సిఫారసు చేసిన వైద్యుడిని అడిగి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.