Site icon HashtagU Telugu

Meal Maker Pulao: మీల్‌మేకర్‌ పులావ్‌.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?

Mixcollage 19 Dec 2023 05 38 Pm 4215

Mixcollage 19 Dec 2023 05 38 Pm 4215

మామూలుగా మనం రకరకాల పులావ్ రెసిపీ లను తినే ఉంటాం. వెజిటేబుల్ పులావ్, ఆలూ పులావ్, లాంటి రకరకాల రెసిపీలను ట్రై చేసి ఉంటాం. అయితే ఎప్పుడైనా మీల్‌మేకర్‌ పులావ్‌ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా ట్రై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మీల్‌మేకర్‌ పులావ్‌ కావలసిన పదార్థాలు:

మీల్‌మేకర్‌ – 250 గ్రాములు
బాస్మతి బియ్యం – 300 గ్రాములు
నెయ్యి – 100 గ్రాములు
ఉప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌
దాల్చిన చెక్క – ఒక ముక్క
అల్లం – 25 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 25 గ్రాములు
యాలకులు – 3
లవంగాలు -12
బిర్యానీ ఆకులు -2
పుదీనా – 1 కట్ట
కొత్తిమీర – 1 కట్ట
పచ్చిమిర్చీ – 5
పచ్చి బఠాణీ – ఒక కప్
ఆలు – 1
ఉల్లిపాయ – ఒకటి

మీల్‌మేకర్‌ పులావ్‌ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీ, మీల్‌మేకర్ విడిగా ఉడికించాలి. తర్వాత స్టవ్‌ వెలిగించుకుని చిన్న కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలి. దాల్చిన చెక్క,ఇలాచి, సగం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. తర్వాత ఉల్లితరుగు, కొత్తిమీర, పుదీనా,బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠాణీ , ఆలు ముక్కలు, మీల్ మేకర్ వేసి వేయించి సరిపడా నీళ్ళుపోసి ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 2 విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి. అంతే మీల్‌మేకర్‌ పులావ్‌ రెడీ.