Meal Maker Pulao: మీల్‌మేకర్‌ పులావ్‌ రెసిపి.. సింపుల్ గా ట్రై చేయండిలా?

మామూలుగా మనకు ఎప్పుడూ తినే వంటకాలు కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్తగా రెసిపీలు తినాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏవైనా సరే కొత్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 30 Jan 2024 04 05 Pm 3512

Mixcollage 30 Jan 2024 04 05 Pm 3512

మామూలుగా మనకు ఎప్పుడూ తినే వంటకాలు కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్తగా రెసిపీలు తినాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏవైనా సరే కొత్తగా రెసిపీలు ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే మీల్ మేకర్ పులావ్ ని ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోండి. మరి ఈ రెసిపీకి ఎలాంటి పదార్థాలు కావాలి. ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే..

కావలసిన వస్తువులు:

మీల్‌మేకర్‌ – 250 గ్రాములు
బాస్మతి బియ్యం – 300 గ్రాములు
నెయ్యి – 100 గ్రాములు
ఉప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌
దాల్చిన చెక్క – ఒక ముక్క
అల్లం – 25 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 25 గ్రాములు
యాలకులు – 3
లవంగాలు -12
బిర్యానీ ఆకులు -2
పుదీనా – 1 కట్ట
కొత్తిమీర – 1 కట్ట
పచ్చిమిర్చీ – 5
పచ్చి బఠాణీ – ఒక కప్
ఆలు – 1
ఉల్లిపాయ -1

మీల్ మేకర్ పులావ్ తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీ, మీల్‌ మేకర్ విడిగా ఉడికించాలి. తర్వాత స్టవ్‌ వెలిగించుకుని చిన్న కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలి. దాల్చిన చెక్క, ఇలాచి, సగం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. తర్వాత ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠాణీ , ఆలు ముక్కలు, మీల్ మేకర్ వేసి వేయించి సరిపడా నీళ్ళుపోసి ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 2 విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పులావ్ రెడీ.

  Last Updated: 30 Jan 2024, 04:05 PM IST