Site icon HashtagU Telugu

Beauty Tips: మచ్చలు, పిగ్మంటేషన్ మాయం అవ్వాలంటే ఎర్ర కందిపప్పుతో ఇలా చేయాల్సిందే?

Mixcollage 23 Jan 2024 08 24 Pm 3662

Mixcollage 23 Jan 2024 08 24 Pm 3662

సాధారణంగా పిగ్మంటేషన్ కారణంగా ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల కూడా ట్యాన్ ఎక్కువగా ఏర్పడి పిగ్మంటేషన్ ఏర్పడుతుంది. ఈ సమస్య దూరమవ్వడానికి చాలా ఇంటి చిట్కాలు ఉన్నాయి. చాలామంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడంతో పాటు వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేకుండా మీ ఇంట్లోనే ఉండే ఎర్ర కందిపప్పుతో ఈ సమస్యలకు పెట్టవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఎర్ర కందిపప్పును ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎర్ర కందిపప్పు బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో సహజ బ్లీచింగ్ ఏజెంట్స్‌ని కలిగి ఉంటుంది.

దీనిని రాయడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు దూరమవుతాయి. అంతేకాకుండా మంచి రంగు కూడా వస్తుంది. దీనిని రాస్తే డార్క్ స్పాట్స్, పిగ్మంటేషన్ దూరమై స్కిన్ మెరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో పాలు కూడా మేలు చేస్తాయి. ఇవి మంచి క్లెన్సర్ అని చెప్పవచ్చు. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. వీటి వల్ల చర్మ రంగు మెరుగ్గా ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. పాలు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ రెండింటిని కలిపి ప్యాక్‌లా చేయాలంటే ముందుగా కొద్దిగా ఎర్ర కందిపప్పు తీసుకుని పాలలో నానబెట్టాలి. ఒక రెండు గంటల తర్వాత గ్రైండ్ చేయాలి.

ఇది ప్యాక్‌లా తయారవుతుంది. దీనిని ముఖానికి అప్లై చేస్తే నల్ల మచ్చలు తగ్గి స్కిన్ ట్యాన్ మెరుగ్గా ఉంటుంది.
ఈ రెండింటిని కలిపి ప్యాక్‌లా చేయాలంటే ముందుగా కొద్దిగా ఎర్ర కందిపప్పు తీసుకుని పాలలో నానబెట్టాలి. ఓ రెండు గంటల తర్వాత గ్రైండ్ చేయాలి. ఇది ప్యాక్‌లా తయారవుతుంది. దీనిని ముఖానికి అప్లై చేస్తే నల్ల మచ్చలు తగ్గి స్కిన్ ట్యాన్ మెరుగ్గా ఉంటుంది.

Exit mobile version