Site icon HashtagU Telugu

Men-Women: మీ కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటున్నారా..? కలిగే నష్టాలివే..

13 Famous Men Who Married Women Much Older Than T 2 3038 1676294395 7 Dblbig

13 Famous Men Who Married Women Much Older Than T 2 3038 1676294395 7 Dblbig

Men-Women: జీవితంలో ప్రతిఒక్కరికీ లైఫ్ పార్ట్‌నర్ అనేది చాలా ముఖ్యం. జీవితాంతం మనకు తోడుగా ఉంటూ మనకు కష్టసుఖాల్లో తోడు ఉండటం కోసం అందరూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. లైఫ్ పార్ట్‌నర్ విషయంలో కొంతమంది విభిన్న రకాల రుచులు ఉంటాయి. లైఫ్ పార్ట్‌నర్ తమకు నచ్చినవాడు కావాలని, తమ అలవాట్లను గౌరవించేవారు కావాలని అనుకుంటూ ఉంటారు. తమను బాగా చూసుకోవాని చాలామంది ఆశపడుతూ ఉంటారు. దీంతో మంచి పార్ట్‌నర్ కోసం వెతుకుతూ ఉంటారు.

అయితే పెళ్లి విషయంలో కొంతమంది ఉద్యోగం, ఆస్తులు లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో ఈ జనరేషన్ లో చాలామంది వయస్సు గురించి కూడా పట్టించుకోవడం లేదు. తమకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని కూడా చేసుకుంటున్నారు. పురుషులు కూడా తమకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను చేసుకుంటే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తమ కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను పురుషులు చేసుకోవడం వల్ల సమాజంలో చిన్నచూపు ఉంటుంది. వారితో కలిసి బయటకు వెళ్లినప్పుడు చులకనగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను పురుషులు చేసుకోవడంపై అజమయిషీ చెలాయించే అవకావం ఉంటుంది. దీని వల్ల కూడా విబేధాలు ఏర్పడే అవకావముంది. పెద్ద వయస్సు ఉన్నవారిని చూసుకోవడం వల్ల అన్నీ తమకు తెలుసనే భావాలో వాళ్లు ఉంటారు. అంతకంటే వారికి స్టామినా ఎక్కువగా ఉంటుంది .దీంతో కొన్నిసార్లు పురుషులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు.

నష్టాలతో పాటు లాభాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ వయస్సు ఉన్నవారిని చేసుకోవడం వల్ల వారికి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. అలాగే తెలివి కూడా ఉంటుంది. దీంతో పురుషులకు చాలా ఉపయోగపడుతుంది.