Vastu tips: వాస్తు ప్రకారం మందారం మొక్కను ఇంట్లో ఏ దిశలో నాటాలో తెలుసా?

సాధారణంగా చాలామంది ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అలంకరణంగా కూడా ఉండాలని అనేక

Published By: HashtagU Telugu Desk
Vastu Tips

Vastu Tips

సాధారణంగా చాలామంది ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అలంకరణంగా కూడా ఉండాలని అనేక రకాల పూల మొక్కలను నాటుతూ ఉంటారు. అయితే కొందరు గార్డెన్ లో నాటుకుంటే మరికొందరు ఇంట్లో పెరిగే మొక్కలను కూడా నాటుకుంటూ ఉంటారు. ఇది వాస్తు శాస్త్ర ప్రకారం కూడా ఇంట్లో కొన్ని మొక్కలు సానుకూల వాతావరణాన్ని సూచిస్తాయి. అంతేకాకుండా వాస్తు ప్రకారం గా కొన్ని మొక్కలను నాటడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇతర మొక్కలతో పాటు వాస్తు శాస్త్రంలో మందార మొక్కకు కూడా ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మరి మందారం మొక్కను ఇంట్లో ఏ దిశలో నాటడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే వాస్తు శాస్త్ర ప్రకారంగా మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు వైపున నాటడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఈ మందారం చెట్టుకు పూసే ఎర్రటి పూలు ఇంటి అందాన్ని మరింత అందంగా మారుస్తాయి. అలాగే మందార పువ్వులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ పువ్వును రోజు వారి పూజకు కూడా ఉపయోగిస్తారు.

మంగళవారం రోజున మందార పువ్వులను ఆంజనేయస్వామికి సమర్పించడం వల్ల ఎంతో మంచిది. అలాగే ఈ మందార పువ్వులను సూర్యభగవానుడి పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కాగా ధర్మశాస్త్రం ,వాస్తుశాస్త్రం రెండింటిలోనూ మందార చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ప్రతికూలత, సమస్యలు ఉంటే ధనం నిలవదు, అశాంతి ఉంటే వాస్తు నిపుణుల సలహా మేరకు ఇంట్లో మందార చెట్టును నాటితే ఎలాంటి సమస్యలు ఉన్న దూరం అవుతాయి. అలాగే ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మనశ్శాంతి లేదు అనుకున్న వారు కూడా మందారం చెట్టును తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

  Last Updated: 25 Oct 2022, 09:04 PM IST