Women Health : మహిళలు వారంలో 2సార్లు ఈ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు..!!

  • Written By:
  • Updated On - November 17, 2022 / 05:09 PM IST

నేటికాలంలో మహిళలు ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లలు ఇలా ఏదొక పనిచేస్తూ బిజీగా ఉంటారు. వారి ఆరోగ్యంపై అస్సలు శ్రద్ధ తీసుకోరు. ఉదయం నుంచి రాత్ర పడుకునేంత వరకు ఎన్నో రకాల పనులు చేస్తూ అలసిపోతారు. అలాంటి మహిళలు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మహిళలు అలసట, నీరసం, నుంచి బయటపడాలంటే..ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో జ్యూస్ తీసుకోవాలి.

ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలంటే రాత్రి పడుకునే సమయంలో ఐదు బాదం పప్పులను నీటి నానబెట్టాలి. తర్వా రోజు వాటిని తొక్క తీసి పక్కన పెట్టాలి. మీడియం సైజ్ ఒ బీట్ రూట్ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత జార్ లో ఈ ముక్కలను వేసి అందులో అరకప్పు కొబ్బరి ముక్కలు, పొట్టు తీసి పక్కన పెట్టిన బాదం గింజలు , ఒక గ్లాసు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని జ్యూస్ ను వేరు చేయాలి. ఈ జ్యూస్ వారంలో రెండు లేదా మూడు సార్లు తాగినట్లయితే మహిళలు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. అధిక బరువు, రక్తహీనత వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు వయస్సు పెరుగుతున్నా కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు తొలగడంతోపాటు ఎముకలు బలంగా మారుతాయి. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.