Site icon HashtagU Telugu

Mango Rawa Pulihora: ఎంతో టేస్టీగా ఉండే మామిడి రవ్వ పులిహోర.. సింపుల్ గా ట్రై చేయండిలా?

Mixcollage 20 Dec 2023 05 46 Pm 4466

Mixcollage 20 Dec 2023 05 46 Pm 4466

మామూలుగా మనం మామిడికాయతో మామిడికాయ చిత్రానం, మామిడికాయ పప్పు, మామిడికాయ చెట్ని, మామిడికాయ పులుసు లాంటి రకరకాల ఆహార పదార్థాలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా మామిడి రవ్వ పులిహోర తిన్నారా. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామిడి రవ్వ పులిహోరకి కావలసిన పదార్థాలు:

మామిడి తురుము – ఒక కప్పు
బియ్యం రవ్వ – ఒక గ్లాసు
నీళ్ళు – రెండు గ్లాసులు
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి తగినంత
పచ్చి మిర్చి – 2
కరివేపాకు – కొద్దిగా
పోపు దినుసులు – సరిపడా
నూనె – చిన్న కప్పు
మెంతి పొడి – ఒక స్పూన్

మామిడి రవ్వ పులిహోర తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా రవ్వని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు గ్లాసుల నీటిని బాణలిలో పోసి నీరు వేడయ్యాక, ఉప్పు, ఒక పచ్చి మిర్చి, కరివేపాకు వేసి ఆ తర్వాత బియ్యం రవ్వ పోసి కలపాలి. ఉండ చుట్టుకోకుండా కలుపుతూ వుండాలి. రవ్వ కొంచం ఉడికి దగ్గరకి అవుతుండగా అప్పుడు మామిడి కోరుని వేసి కలపాలి. స్టవ్ ఆపేసి మూత పెట్టి 5 నిముషాలు ఉంచితే రవ్వ ఉమ్మగిల్లుతుంది. ఇక ఇప్పుడు ఉడికించిన రవ్వని ఒక పళ్ళెంలోకి తీసి పరుచుకోవాలి. పైన ఒక రెండు చెంచాల నూనె, చిటికెడు పసుపు వేసి పొడి వేసి పొడిగా కలపాలి. ఇప్పుడు ఒక చెమ్చా మెంతి పొడి వేసి కలిపి, ఇక ఆఖరుగా నూనెలో శనగపప్పు, మినపపప్పు, వేరు శనగపప్పు, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి పోపు చిటపటలాడుతుండగా, ఇంగువ వేసి ఆ పోపుని కూడా ఉడికించిన రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ పులిహోరని మూత పెట్టి ఒక పది నిముషాలు ఉంచితే ఎంతో టేస్టీగా ఉండే మామిడి రవ్వ పులిహోర.