Mango Pachhadi: ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడిని సింపుల్గా తయారు చేసుకోండిలా?

నెమ్మదిగా మామిడికాయల సీజన్ మొదలవుతోంది. ఇప్పటికే చాలా వరకు కొన్ని కొన్ని ప్రదేశాలలో మామిడికాయలు లభిస్తున్నాయి. అయితే మామూలుగా మనం

Published By: HashtagU Telugu Desk
Mixcollage 06 Feb 2024 08 30 Pm 9672

Mixcollage 06 Feb 2024 08 30 Pm 9672

నెమ్మదిగా మామిడికాయల సీజన్ మొదలవుతోంది. ఇప్పటికే చాలా వరకు కొన్ని కొన్ని ప్రదేశాలలో మామిడికాయలు లభిస్తున్నాయి. అయితే మామూలుగా మనం మామిడికాయలతో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూ ఉంటాం. మామిడి పప్పు, మామిడికాయ చారు, మామిడికాయ అన్నం, మామిడికాయ పులుసు ఇలా ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసే ఉంటాం. అయితే ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు:

మామిడికాయలు – రెండు
బెల్లం – కొద్దిగా
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – రుచికి తగినంత
పసుపు – ఒక టీస్పూన్‌
నూనె – ఒక టేబుల్‌స్పూన్
ఎండుమిర్చి – రెండు
ఆవాలు – అర టీస్పూన్‌
ఎండుమిర్చి – మూడు.

మామిడికాయ పచ్చడి తయారీ విధానం:

ఇందుకోసం మామిడికాయల పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని కుక్కర్‌లో వేసి బెల్లం, పసుపు, పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఎండు మిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. ఇప్పుడు బౌల్‌లో ఉన్న పచ్చడి వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కాసేపు ఉడికించుకున్న తరువాత దింపుకొంటే మామిడికాయ పచ్చడి రెడీ.

  Last Updated: 06 Feb 2024, 08:32 PM IST