Mango Lassy: మధ్యాహ్న వేల చల్లచల్లగా ఉండే మ్యాంగో లస్సీని తయారు చేసుకోండిలా?

వేసవి కాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లలో మామిడిపండు కూడా ఒకటి. ఈ మామిడి పండును ఉపయోగించి చాలా రకాల డ్రింక్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అ

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 10:00 PM IST

వేసవి కాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లలో మామిడిపండు కూడా ఒకటి. ఈ మామిడి పండును ఉపయోగించి చాలా రకాల డ్రింక్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో మ్యాంగో లస్సి కూడా ఒకటి. ఎండాకాలంలో ఎక్కువ శాతం మంది చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ఇష్టపడే జ్యూస్ మ్యాంగో లస్సి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో లస్సి ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మ్యాంగో లస్సీకి కావాల్సిన పదార్థాలు :

మామిడి పండ్ల గుజ్జు- ఒక కప్పు
యోగర్ట్‌- ఒక కప్పు
చల్లని పాలు – సగం కప్పు
నీళ్లు – సగం కప్పు
చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి- పావు టీస్పూన్‌
అలంకరణ కోసం కొద్దిగా పిస్తా
ఐస్ క్యూబ్ – కొద్దిగా

మ్యాంగో లస్సీ తయారీ విధానం :

మిక్సీలో మామిడి పండు గుజ్జు వేసి మెత్తని పేస్టులా చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో యోగర్ట్‌ తరువాత చల్లని పాలు లేదా నీళ్లు పోయాలి. చక్కెర, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. మ్యాంగో లస్సీని గ్లాసులో పోసి పిస్తాతో అలంకరించి సర్వ్‌ చేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో లస్సి రెడీ.