లైంగిక ఆనందం అనేది అటు ఆడవాళ్లు, ఇటు మగవాళ్లు ఇద్దరూ సమానంగా ఆనందించే విషయం. అయితే ఆ విషయంలో ఎవరు ఎక్కువగా ఆనందం పొందుతారనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. కొన్ని పాత గ్రంధాలు స్త్రీలు సెక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారని చెబుతున్నాయి. కానీ దానికి ఎటువంటి శాస్త్రీయ రుజువు లేదు. పలు హెల్త్ సర్వేలు కూడా స్పష్టం చేయలేకపోయాయి. స్త్రీలు సాధారణంగా తాము ఇష్టపడే వారితో మాత్రమే శారీరక సంబంధాలను ఆస్వాదిస్తారట. కేవలం శారీరక ఆనందాల కోసమే సెక్స్ చేయడానికి ఇష్టపడరట. అసాధారణ హార్మోన్ల అసమతుల్యత కారణంగానూ ఆడవాళ్లలో కోరికలు కలగడానికి ప్రేరేపిస్తాయని పలు సర్వేలు అంటున్నాయి.
మరోవైపు, పురుషులు వారి జీవ వ్యవస్థ, హార్మోన్ల థ్రస్ట్ ప్రకారం చాలా సులభంగా అపరిచితులతో కూడా శారీరక సంబంధం కలిగి ఉంటారు. లైంగిక ఆనందం పొందాలని ఒక్కసారి ఫిక్స్ అయితే.. వెంటనే కోరికలు నెరవేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. అయితే పురుషులు కాకుండా స్త్రీలు లైంగిక ఆనందాన్ని త్వరగా పొందగలరని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ప్రేమలో కొత్త మార్గాల కోసం కూడా లైంగికం పట్ల ఆసక్తి చూపుతారు. మొత్తానికి, ఒక మనిషి ఆనందాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకుంటే అది ఏకపక్షంగా ముగుస్తుంది. కానీ ఇద్దరూ ఇష్టం చూపితే లైంగిక ఆనందం మరింత పొందుతారు.