Site icon HashtagU Telugu

Summer Fruit Salads : సమ్మర్ స్పెషల్.. రకరకాల హెల్తీ ఫ్రూట్ సలాడ్స్.. ఎలా చేయాలో తెలుసా?

Weight Gain

Weight Gain

Summer Fruit Salads : ఎండాకాలంలో మన శరీరంలో తొందరగా జీర్ణం అయ్యేవి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. సమ్మర్లో ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రకరకాల పండ్లతో ఫ్రూట్ సలాడ్స్ ఎలా తయారుచేసుకోవాలి తెలుసుకుందాము.

స్ట్రాబెర్రీ, గ్రేప్ సలాడ్..

కావలసిన పదార్థాలు..
* స్ట్రాబెర్రీలు పది(తరిగినవి)
* ద్రాక్ష ఒక కప్పు
* సపోటా ముక్కలు అరకప్పు
* జామ ముక్కలు అరకప్పు
* నల్ల ద్రాక్ష రసం ఒక స్పూన్
* మూడు స్పూన్ల క్రీము, చెర్రీలు నాలుగు

తయారుచేయు విధానం..

సపోటా, జామ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష ముక్కలను అన్నింటిని ఒక గిన్నెలో వేయాలి. వాటన్నింటిని బాగా కలుపుకోవాలి తరువాత దాని పైన క్రీమ్ వేసి మధ్య మధ్యలో చెర్రీలు పెట్టి చుట్టూ ద్రాక్ష రసం పోయాలి.

కీరకర్భూజ సలాడ్..

కావలసిన పదార్థాలు..
* కీర దోసకాయ ముక్కలు రెండు కప్పులు
* టమాటా ముక్కలు రెండు కప్పులు
* కర్భూజ ముక్కలు రెండు కప్పులు
* ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి
* ఉప్పు సరిపడ
* మిరియాల పొడి మూడు స్పూన్లు
* వెనిగర్ కొద్దిగా

తయారుచేయు విధానం..

కీరదోసకాయ, కర్భూజ, టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నింటిని ఒక గిన్నెలో వేసి కలపాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. అంతే సలాడ్ రెడీ. ఇది హాట్ సలాడ్. దీనిని వెంటనే తినవచ్చు లేదా కాసేపు ఫ్రిజ్ లో పెట్టి తినవచ్చు.

పుచ్చకాయ సలాడ్..

కావలసిన పదార్థాలు..
* పుచ్చకాయ ముక్కలు ఒక కప్పు
* కర్భూజ ముక్కలు అరకప్పు
* పుదీనా రెండు రెమ్మలు
* పెరుగు ఒక స్పూన్
* ఉప్పు చిటికెడు

తయారు చేయు విధానం..

పుచ్చకాయ ముక్కలు, కర్భూజ ముక్కలు, పుదీనా, పెరుగు, ఉప్పు అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. అంతే పుచ్చకాయ సలాడ్ రెడీ అయినట్లే.

వీటితో పాటు ఆల్ మిక్స్ ఫ్రూట్ సలాడ్ అన్ని పండ్లతో కలిపి చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న పండ్లతో సలాడ్స్ ను తయారుచేసుకోవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి, అలాగే రుచిగా కూడా ఉంటాయి.

 

Also Read : Keera Dosakaya Raitha : ఎండాకాలంలో కీరదోసకాయ పెరుగు పచ్చడి.. ఎలా చేయాలంటే.. హెల్త్‌కి ఎంత మంచిదో తెలుసా?