Site icon HashtagU Telugu

Walk And Weight Loss: బరువు తగ్గడానికి 5 సులువైన మార్గాలు

Weight Loss

Weight Loss

జీవన శైలిలో మార్పులు రావడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ బరువు పెరుగుతున్నారు. పిల్లలకు పాఠశాలల్లో ఆటల్లేవు, యువకులకు, పెద్దవారికి వ్యాయామంలేదు. కూర్చొని పనిచేసే ఉద్యోగాలే అవడంతో శారీరక శ్రమ ఉండటంలేదు. దాంతో అందరి శరీర బరువు పెరిగిపోతోంది. ఈ బరువు తగ్గించుకోవడానికి నిపుణులు అయిదు సులభమైన మార్గాలు చెబుతున్నారు.

1.ముందు ఆహారాన్ని ఎక్కువసార్లు తినడం తగ్గించుకోవాలి. అలా అని కడుపు మాడ్చుకోవలసిన అవసరంలేదు. శక్తి తగ్గకుండా, నీరసం రాకుండా పండ్లు, పండ్ల రసం తీసుకోండి. మంచినీరు కూడా ఎక్కువ తాగాలి.
2.కార్బోహైడ్రేట్స్, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవద్దు. మంచి ప్రొటీన్ గల ఆహారం తీసుకోండి. మీరు తీసుకునే ఆహారంలో కూరగాయలు,ఆకు కూరలు ఎక్కువగా ఉండేవిధంగా చూసుకోండి.వంటలకు కొబ్బరి నూనె వాడటం ఉత్తమం.
3.వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలా అని వారం రోజులూ చేయవలసిన అవసరంలేదు. వారంలో మూడు లేదా నాలుగు రోజులు చేస్తే చాలు. ప్రతిరోజూ చేసేవారు తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఇంటి పనులు, తోట పనులు స్వయంగా చేసుకోవడం ఉత్తమం.
4. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి. బరువు తగ్గడానికి నడక చాలా ఉత్తమమైనది. నడవగలిగినవారు ఎత్తుగా ఉండే ప్రదేశాలపైకి నడిస్తే మంచిది. ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి.గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
5.మీ నడకలో మార్పులు చేసుకోవచ్చు. అంటే కొద్దిసేపు వేగంగా నడిచి, తరువాత కొద్ది సేపు జాగింగ్ చేసి, ఆ తరువాత నెమ్మదిగా నడవవచ్చు. ఇలా మీ ఇష్టానుసారం మధ్యమధ్యలో మార్పులు చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం నడిచేటప్పుడు వేసుకునే పాదరక్షలు మంచి పట్టు కలిగి ఉండేవిధంగా చూసుకోవాలి.
ఈ అయిదింటిని పాటిస్తే మీరు సులభంగా బరువు తగ్గుతారు.