Site icon HashtagU Telugu

Hair Tips: తల స్నానం వేడి నీటితో చేస్తే మంచిదా.. లేక చల్ల నీటితో చేస్తే మంచిదా?

Mixcollage 04 Mar 2024 10 11 Pm 4712

Mixcollage 04 Mar 2024 10 11 Pm 4712

స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి చల్లనీటితో చేస్తే మంచిదా లేక వేడి నీటితో చేస్తే మంచిదా అన్న సందేహం కలిగే ఉంటుంది. ఈ విషయం గురించి చాలామందికి సరైన సమాధానం తెలియక ఎలా పడితే అలా స్నానం చేసి లేనిపోని ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దాదాపుగా అందరు ఎదుర్కొనే సౌందర్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. కాలాలు మారినప్పుడల్లా ఈ సమస్య కలుగుతుంది. సరైన సంరక్షణ సమతుల్య ఆహారంతో, జుట్టు సన్నబడడాన్ని నియంత్రించవచ్చు. సరైన రక్షణ లేకుండా ఎండ, కాలుష్యం, వర్షపు నీరు మరియు ధూళి అధికంగా మీ జుట్టుపై పడటం వల్ల మీ జుట్టు పొడిగా, పెళుసుగా అవుతుంది. జుట్టును వీలైనంత వరకూ రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.

ఒకవేళ ఎప్పుడైనా వర్షం లేదా ధూళి జుట్టుపై పడితే, అదే రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కండీషనర్‌ అప్లై చేయడం మర్చిపోవద్దు. మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు మంచి పోషణను ఇచ్చే కండీషనర్‌ను అప్లయ్ చెయ్యండి. అలాగే, కండీషనర్ ను వాష్ చేసేటపుడు చల్లటి నీటిని ఉపయోగించటానికి ప్రయత్నించండి. ఇది రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది మరియు తల మీద చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కండీషనర్ వాడటం వల్ల మీ జుట్టు కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. క్రమం తప్పకుండా జుట్టును కత్తిరించడం వలన మంచి ఆకారంతో మరియు స్టైల్ గా ఉండటమే కాకుండా అందరిని బాధపెట్టే స్ప్లిట్ ఎండ్స్ సమస్యను మరియు జుట్టు పొడిబారడాన్ని తగ్గించుకోవచ్చు.

ఇది జుట్టు పెరుగుదలను పెంచడానికి కూడా సహాయపడుతుంది. జుట్టు రింగులు పడకుండా జాగ్రత్త పడాలి. అధిక తేమ స్థాయిలు జుట్టును రింగులు పడేట్లు చేస్తాయి మరియు జుట్టు రాలడానికి కూడా కారణం కావచ్చు. జుట్టు రింగులు పడితే దాన్ని తగ్గించడానికి ఒక సులభమైన మార్గం ఏమిటంటే జుట్టును వాష్ చేసిన తర్వాత తడి ఆరాక సీరం అప్లయ్ చెయ్యాలి. సీరం అప్లయ్ చెయ్యడం వల్ల మీ జుట్టు మృదువుగా మారి రింగులు పడవు. అప్పుడు జుట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. హెయిర్ స్టైల్ మంచిగా ఉంచుకోవాలి. దీని వల్ల మీ జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులలో, ప్రతి ఒక్కరు వారి జుట్టును టోపీ లేదా కండువాతో కప్పుకోవాలి.

జుట్టు ఊడిపోవడాన్ని నివారించడానికి చక్కగా దువ్వాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టును విడదీయడానికి పెద్ద పెద్ద వెడల్పైన పళ్ళు ఉన్న దువ్వెనలను ఉపయోగించండి. జుట్టు ఊడిపోకుండా ఉండటానికి, మీ జుట్టు దువ్వేటప్పుడు మొదట జుట్టును చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ తర్వాత జుట్టు చివరి భాగం నుండి నెమ్మదిగా మరియు చాలా సున్నితంగా దువ్వడం మొదలు పెట్టాలి, అక్కడ దువ్వడం పూర్తయ్యాక పైభాగంలో దువ్వడం ప్రారంభించాలి. ఇలా దువ్వడం వలన చిక్కులు సులభంగా పోతాయి. దీని వల్ల జుట్టు ఎక్కువగా డామేజ్ కాదు. జుట్టు ఊడటం తగ్గుతుంది.