మామూలుగా మనం స్నానం చేసేటప్పుడు కొందరు చల్ల నీటితో స్నానం చేస్తే మరి కొందరు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. కొందరు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్ల నీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. మరికొందరు వేడినీటితో స్నానం చేస్తుంటారు. అయితే ఎటువంటి నీటితో స్నానం చేసిన హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారు. కాగా వెంట్రుకలు రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి సరైన రక్షణ లేకుండా ఎండ, కాలుష్యం, వర్షపు నీరు ధూళి అధికంగా మీ జుట్టుపై పడటం వల్ల మీ జుట్టు పొడిగా, పెళుసుగా అవుతుంది. జుట్టును వీలైనంత వరకూ రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
ఒకవేళ ఎప్పుడైనా వర్షం లేదా ధూళి జుట్టుపై పడితే, అదే రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కండీషనర్ అప్లై చేయాలి. మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు మంచి పోషణను ఇచ్చే కండీషనర్‌ను అప్లయ్ చెయ్యాలి. అలాగే, కండీషనర్ ను వాష్ చేసేటపుడు చల్లటి నీటితో చేయడం మంచిది. ఇది రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది. అలాగే తల మీద చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కండీషనర్ వాడటం వల్ల మీ జుట్టు కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. అయితే క్రమం తప్పకుండా జుట్టును కత్తిరించడం వలన ఆకారంతో స్టైల్ గా ఉండటమే కాకుండా అందరిని బాధపెట్టే స్ప్లిట్ ఎండ్స్ సమస్యను జుట్టు పొడిబారడాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
ఇది జుట్టు పెరుగుదలను పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే జుట్టు రింగులు పడకుండా జాగ్రత్త పడాలి. అధిక తేమ స్థాయిలు జుట్టును రింగులు పడేట్లు చేస్తాయి. జుట్టు రాలడానికి కూడా కారణం కావచ్చు. జుట్టు రింగులు పడితే దాన్ని తగ్గించడానికి ఒక సులభమైన మార్గం ఏమిటంటే జుట్టును వాష్ చేసిన తర్వాత తడి ఆరాక సీరం అప్లయ్ చెయ్యాలి. సీరం అప్లయ్ చెయ్యడం వల్ల మీ జుట్టు మృదువుగా మారి రింగులు పడవు. అప్పుడు జుట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది.